ప్రతి ఒక్కరి జీవితంలో యోగాతో ఆనందం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరి జీవితంలో యోగాతో ఆనందం

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

ప్రతి ఒక్కరి జీవితంలో యోగాతో ఆనందం గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున యోగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని.. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర దిశగా లక్ష్యాల సాధనకు ఇవి గొప్ప ముందడుగు, పునాది అని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా విజయవాడ అర్బన్‌ పరిధిలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో శుక్రవారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల థీమ్‌ యోగా జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీశ, ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌, వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. ఏపీ ఎన్‌జీవో ప్రధాన కార్యదర్శులు ఏ. విద్యాసాగర్‌, డీవీ రమణ, జిల్లా ప్రెసిడెంట్‌ డీఎస్‌ఎన్‌ రెడ్డి, కార్యదర్శి పి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ. 4లక్షల విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ టిక్కిల్‌రోడ్డుకు చెందిన ఎం. నరసింహరావు కుటుంబం శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ రాధా కృష్ణను కలిసి అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి ఎం. నరసింహరావు పేరిట రూ. లక్ష, ఎం. అన్నపూర్ణమ్మ పేరిట రూ. లక్ష, ఎం. రాజ్యలక్ష్మి పేరిట రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. అలాగే గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన పరుచూరి సాయి స్నేహ కుటుంబం రూ. 1,00,001 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ముగిసిన యోగా పోస్టర్‌ మేకింగ్‌ పోటీలు పలు రైళ్ల దారి మళ్లింపు

గుడ్లవల్లేరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంగలూరులోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్‌)లో నిర్వహిస్తున్న పోస్టర్‌ మేకింగ్‌ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల విద్యార్థులకు జిల్లా స్థాయి పోస్టర్‌ మేకింగ్‌ పోటీలను రెండు రోజుల పాటు ప్రభుత్వ డైట్‌ కళాశాల, అంగలూరులో విజయవంతంగా నిర్వహించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే పోస్టర్లను రూపొందించారు. కృష్ణా జిల్లా విజేతగా జి. అపూర్వ (10వ తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, అంగలూరు), ఎన్టీఆర్‌ జిల్లా విజేతగా ఎస్‌కే హఫ్సా తహ్సీన్‌ (10వ తరగతి, పి.ఎం. శ్రీ ఎం.కె. బైగ్‌ ఎం.సి.హెచ్‌.ఎస్‌, విజయవాడ) నిలిచారు. వీరితో పాటు రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందించామని డైట్‌ ప్రిన్సిపాల్‌ కె.లక్ష్మీనారాయణ తెలిపారు.

రైల్వేస్టేషన్‌( విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్‌ అరక్కోణం జంక్షన్‌లో జరుగుతున్న నాన్‌–ఇంటర్‌లాకింగ్‌, స్టేషన్‌ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రు ప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం–ఖరగ్‌పూర్‌ (22604), 24న తిరు నెల్వేలి–పురూలియా (22606), 25న టాటా నగర్‌–యర్నాకుళంం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement