మందుల్లేవ్‌.. సౌకర్యాలూ లేవు | - | Sakshi
Sakshi News home page

మందుల్లేవ్‌.. సౌకర్యాలూ లేవు

Jun 20 2026 12:30 PM | Updated on Jun 20 2026 12:30 PM

దయనీయ స్థితిలో ప్రభుత్వాస్పత్రులు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సౌకర్యాలు లేక నిరుపేద రోగులు అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద వాడి ప్రాణాల కంటే.. ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుతాస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు రంగులు వేసి, తామే చేసినట్లు బిల్డప్‌ ఇవ్వడం మినహా చేసిందేమీ లేదని ఆరోపించారు.

వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్‌లు ఉండవు..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిత్యం 3వేల మంది వరకూ రోగులు వస్తుంటారని, నడవలేని వారికి కనీసం వీల్‌చైర్‌లు, స్ట్రెచర్‌లు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొందని విష్ణు ఆరోపించారు. పేదవాడికి సంజీవని లాంటి ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందన్నారు. వైద్యం పొందాలంటే ఇళ్లు, వంటిపైన నగలు తాకట్టు పెట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కాని ంగ్‌ మెషిన్‌లు పనిచేయకున్నా పట్టంచుకునే వారు లేరన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మీటింగులు పెట్టడం కాదని విజయవాడ జీజీహెచ్‌కి వచ్చి ఎక్స్‌–రే రూమ్‌, ఎమ్మారై రూమ్‌ల ముందు క్యూ కట్టిన పేద రోగుల కష్టాలను కళ్లారా చూడాలని విష్ణు హితవు పలికారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement