గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణలంక యువకుడు సాయికృష్ణ ఘటనపై అత్యున్నత విచారణ సంస్థలతో నిష్పాక్షికంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయా లని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. గవర్నర్‌పేట శ్రీశ్రీ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయి కృష్ణ ఘటనలో 40 రోజులు గడుస్తున్నా నేటికి అధికారులు, ప్రభుత్వం నోరు విప్పకపోవడం సమంజసం కాదన్నారు. నగరంలో ఈస్థాయి ఘటనలు జరుగుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు కనీసం స్పందించదని విమర్శించారు. బాధిత కుటుంబానికి ముఖ్యంగా యువకుడు తల్లి, ఒంటరి మహిళకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు భూపతి రమణారావు, పుప్పాల కృష్ణ, బోయ సత్యబాబు పాల్గొన్నారు.


