న్యూస్‌రీల్
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
పగలంతా పుడమికి వెలుగును ప్రసాదించిన భానుడు... ఇక ఈ రోజుకి టాటా...చెబుతూ గిరి శిఖరాల చాటున తలదాచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఉదయం ఉషోదయంతో పరవశించిన వృక్షాలు వింజామరల్లా తమ కొమ్మలను ఉయ్యాలలూపుతూ సూర్య భగవానుడికి బై..బై.. చెబుతున్నాయి. మలి సంధ్య వేళలో ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత చిత్రం ఎంతో రమణీయంగా ఉంది కదూ... విజయవాడ గుణదల ప్రాంతంలో బుధవారం సాయంత్రం సూర్యాస్తమయం వేళ కనువిందు చేసిన ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


