కృష్ణానదిపై విద్యుత్‌ లైన్లకు మార్కర్‌ స్పియర్లు | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిపై విద్యుత్‌ లైన్లకు మార్కర్‌ స్పియర్లు

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

కృష్ణానదిపై విద్యుత్‌ లైన్లకు మార్కర్‌ స్పియర్లు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని పున్నమీఘాట్‌ నుంచి భవానీ ఐల్యాండ్‌ మధ్య కృష్ణానదిపై 11కేవీ ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్ల పై ఏవియేషన్‌ మార్కర్‌ స్పియర్లను ఏపీసీపీడీసీఎల్‌ సిబ్బంది మంగళవారం అమర్చారు. కృష్ణానదిపై నుంచి ఆకాశంలో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్ల పైలెట్లకు విద్యుత్‌ తీగలు స్పష్టంగా గుర్తించేందుకు ఈ ఏవియేషన్‌ మార్కర్‌ స్పియర్లు దోహదం చేస్తాయని ఏపీసీపీడీసీఎల్‌ విజయవాడ టౌన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కావేటి కొండలరావు చెప్పారు. ప్రజల భద్రతతో పాటుగా విద్యుత్‌ మౌలిక వసతుల రక్షణకు కూడా ఈ మార్కర్‌ స్పియర్లు ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement