న్యూస్‌రీల్
ఒక్కొక్కరు 36 యాప్‌లలో సమాచారం నింపాల్సిన పరిస్థితి ఏదైనా తేడా జరిగితే ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తీవ్ర వత్తిడితో అనారోగ్యం పాలవుతున్న ఏఎన్‌ఎంలు
యాప్‌లను తగ్గించాలి
పోలీసుల కళ్లుగప్పి.. గంజాయి స్మగ్లర్ పరారీ
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026
ఏఎన్‌ఎంలకు యాప్ కష్టాలు
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 4130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి నందిగామకు చెందిన కె.నరసింహారావు కుటుంబం సోమవారం రూ.1,00,100 విరాళం సమర్పించింది. అనంతరం స్వామి వారిని దర్శించుకుంది.
గన్నవరం: విమానాశ్రయంలో సోమవారం యాత్రి సువిధా దివస్ ఘనంగా నిర్వహించారు. విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు తిలకం దిద్ది ఆత్మీయ స్వాగతం పలికారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైందని, ప్రజలు కీలకభాగస్వాములై దీనిని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. దోషరహిత ఓటర్ల జాబితా ఈ కార్యక్రం లక్ష్యమని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్‌లో భాగంగా బీఎల్వోలు ఇంటింటి సందర్శన కీలక దశ ప్రారంభమైందని వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా జూలై 14వ తేదీ వరకు బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్‌లు) అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తా రని వివరించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించా మని పేర్కొన్నారు. జిల్లాలో 1,792 మంది బీఎల్వోలు ఉన్నారని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి తిరిగి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఓటర్లకు బీఎల్వోలు సహకరిస్తారన్నారు. ఇంటింటి సర్వే ముగిసిన అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురిస్తామని వివరించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో సేవలు అందించే ఏఎన్‌ఎంలను యంత్రాలుగా మార్చేశారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులకు పరిమితం అయ్యారు. వివిధ ప్రోగ్రామ్‌ల పేరుతో 36 యాప్ అప్లికేషన్లను వారిపై బలవంతంగా రుద్దారు. ఉన్న సమయం ఆ యాప్‌లలో సమాచారం నింపేందుకే సరిపోతోంది. ఫలితంగా ఆరోగ్య కార్యక్రమాలు పక్కదారి పడుతున్నాయి. మరో వైపు యాప్‌లలో సమాచారం అప్‌లోడ్ చేసేందుకు ఏఎన్‌ఎంలు తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిమిషం ఖాళీ లేకుండా ఆకలి దప్పులు మరిచి స్మార్ట్ ఫోన్లతో కుస్తీ పడుతూ సమాచారం అప్‌లోడ్ చేస్తూ సతమతం అవుతున్నారు. నెట్‌వర్క్ సరిగా లేకున్నా, సర్వర్లు పనిచేయకున్నా యాప్‌లో సమాచారం నింపేందుకు ఏఎన్‌ఎంలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్కొక్క సారి సమాచారం మొత్తం నింపినా టెక్నికల్ ఎర్రర్ వచ్చి మొత్తం పోతోంది. దీంతో మొదటి నుంచి మళ్లీ సమాచారం నింపాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల నుంచి పదే పదే వచ్చే ఫోన్‌లకు సమాధానం ఇస్తూ, సమాచారం అప్‌లోడ్ చేస్తూ నిరంతరం మానసిక వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్యాల బారిన పడుతున్నట్లు పలువురు ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
36 యాప్‌ల భారం
ప్రధానంగా ఏఎన్‌ఎం ఏపీ హెల్త్ ఆప్‌లో ఉండే ఆర్‌సీహెచ్ ప్రోగ్రామ్‌లో ఎనిమిది యాప్‌లు ఉంటాయి. వాటిలో చైల్డ్ హెల్త్‌కు సంబంధించి అనేక అంశాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎన్‌సీడీ–సీడీ, ఆభ జనరేషన్, ఇమ్యూనైజేషన్, నోటీసెస్, ఎన్‌ఎల్‌పీ– ఏపీ, శానిటేషన్, సర్వైలెన్స్, ఎన్‌డీడీ, సిటిజన్ డెత్ స్టేటస్, వీహెచ్‌సీ ప్రొఫైల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ, హెచ్‌బీఏ1సీ శాంపిల్ కలెక్షన్ తదితర మొత్తం 36 యాప్‌లలో వారు సమాచారం నింపాల్సి ఉంటోంది. వారి పరిధిలో గర్భిణులు ఎంత మంది, వారి ప్రసవ తేదీలు ఏమిటి, హైరిస్క్ ప్రెగ్నెంట్లు ఎవరు వంటి అన్ని అంశాలను యాప్‌లలో అప్‌లోడ్ చేయాల్సి రావడంతో ఏఎన్‌ఎంలు సతమతం అవుతున్నారు.
ఉన్నతాధికారులతో చీవాట్లు
అన్ని రకాల యాప్‌లలో సమాచారం అప్‌లోడ్ చేయడంలో సతమతం అవుతున్న ఏఎన్‌ఎంలకు ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తప్పడం లేదు. ఏదైనా సమాచారం యాప్‌లో నమోదు కాకున్నా, టెక్నికల్ సమస్య తలెత్తి సరైన సమయంలో అప్‌లోడ్ చేయకున్నా ఉన్నతాధికారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని, చీవాట్లతో విరుచుకుపడుతున్నాని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయవాడ పరిధిలో సాంకేతిక సమస్య లతో ఫొటోలు అప్‌లోడ్ కాక ఏకంగా 35 మంది ఏఎన్‌ఎంలు మెమోలు అందుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వివరిస్తున్నారు. అధికారులిచ్చే టార్గెట్లు పూర్తి చేసేందుకు రాత్రి పది గంటల వరకూ స్మార్ట్ ఫోన్లతో కుస్తీ పడుతున్నామని వాపోతున్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల సమస్యలపై సత్వరం స్పందించి, వీలైనంత త్వరగా నాణ్యతతో వాటిని పరిష్కరిస్తున్నా మని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రతి అధికారి పీజీఆర్‌ఎస్ అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సంతృప్త స్థాయి బాగుండాలంటే అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ ద్వారా మొత్తం 201 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి అత్యధికంగా 56 అర్జీలు అందాయని పేర్కొన్నారు. పురపాలక శాఖకు సంబంధించి 31 అర్జీలు, పోలీస్ శాఖ 29, పంచాయతీరాజ్ శాఖ 17, డీఆర్‌డీఏ 10, విద్యుత్ 9, వైద్య–ఆరోగ్యం ఏడు, ప్రజారవాణా ఆరు, ఏపీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఐఈఎస్ ఐదు, కాలుష్య నియంత్రణ నాలుగు, ఎండోమెంట్స్, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో మూడు చొప్పున, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, విద్య, ఉపాధికల్పన, గృహ నిర్మాణం, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ లో రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. బీసీ సంక్షేమం, సహకార, డ్వామా, మత్స్య, జాతీయ రహదారులు విభాగాలకు ఒకటి చొప్పున వచ్చాయని తెలిపారు.
ప్రతి ఇంటికీ వెళ్లి ఏమ్మా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఎన్‌ఎంలు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారి యాప్‌లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. యాప్‌లతో ప్రయోజనం ఎంత ఉందో తెలియదు కానీ ఏఎన్‌ఎంలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఎన్‌ఎంలపై యాప్ అప్లికేషన్ల భారం తగ్గిం చాలి. ఈ ఏమేరకు గతంలోనే ఉన్నతాధికారులకు విన్నవించాం.
– బి.ఆస్కారావు, రాష్ట్ర అధ్యక్షుడు,
ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం
పటమట(విజయవాడతూర్పు): గంజాయి తరలిస్తూ పట్టుబడిన స్మగ్లర్ పోలీసుల నిర్లక్ష్యంతో స్టేషన్ నుంచి పరార య్యాడు. రాత్రి వేళలో మూత్ర విసర్జనకు బయటకు తీసుకురాగా స్టేషన్ గోడదూకి పారిపోయాడని సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్‌లో విధులు నిర్వర్తించే సిబ్బందిపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమ వారం కోర్టులో హాజరు పరచాల్సి ఉండటంతో నిందితుడిని గాలింపునకు రెండు బృందాలను ఏర్పాటు చేశారని, ఒకటి కేరళ, మరొకటి ఢిల్లీ పంపారని సమాచారం. వివరాలు ఇవి.. ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున కేరళ మలప్పురం, చెరుకరకు చెందిన మహ్మద్ సోహైల్, ఒడిశాకు చెందిన అనూప్‌సింగ్, రాజేష్ కుమార్ గుట్టుగా ఒడిశా నుంచి తమిళనాడు కోయంబత్తూరుకు లారీలో గంజాయి తరలిస్తుండగా ఈగల్ టీంకు సమాచారం వచ్చింది. ఈగల్‌టీం నిడమానూరు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించి సోహైల్ బృందం తరలిస్తున్న 140 కేజీల గంజాయి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసు కుని పటమట పోలీసులకు అప్పగించారు. కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు శుక్రవారం రాత్రి స్టేషన్‌లోని గోడదూకి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీ ఆర్ జిల్లా కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర్‌బాబు నిందితుడు సోహైల్ గాలింపు కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.


