ఆటో బండి నడవాలంటే ఇంధనం కావాలి. బండి నడిస్తేనే జేబులోకి నాలుగు రూపాయలు వచ్చేది. డబ్బులు వస్తేనే కుటుంబానికి రోజు గడుస్తుంది. సీఎన్‌జీ ఆటోలో ఇంధనం నింపాలంటే గంట పాటు వేచిచూడక తప్పదు. గంటపాటు ఇంధనం కోసమే ఎదురుచూసి, ఆపై ప్రయాణికుల కోసం పడిగాపులు కాయక తప్పడంలేదని ఆటో వాలాలు వాపోతున్నారు. విజయవాడ గాంధీనగర్‌లో ఉన్న జిల్లా సబ్‌జైలు సమీపంలోని బంక్ వద్ద సీఎన్‌జీ కోసం ఎదురుచూస్తున్న ఆటోలను ఈ చిత్రంలో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


