నేను 2009లో హైదరాబాద్‌లో తలసేమియా చిన్నారులు రక్తం అందక పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయా. వివేకానంద యూత్ ట్రస్టు ఏర్పాటు చేసి ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులను చేర్చుకుని అవసరమైన వారికి రక్త దానం చేస్తున్నాం. గుండె శస్త్ర చికిత్సలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసరమైతే ఎవరు ఫోన్ చేసినా మా సభ్యులు వెళ్లి రక్తం దానం చేస్తారు. నాది బీ పాజిటివ్. ఇప్పటికి 36 సార్లు రక్తదానం చేశా. మా ట్రస్టులో 5 వేల మంది వలంటీర్లు ఉన్నారు. ఈ 16 ఏళ్లల్లో 8 వేల యూనిట్లు వరకు రక్తదానం చేశారు.
–డాక్టర్ కృష్ణ ప్రసన్న వైట్ల, అధ్యక్షుడు, వివేకానంద యూత్ ట్రస్టు


