గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలు ఇంటర్మీడియెట్‌ – 2026 ఫలితాలలో చక్కని ఫలితాలను సాధించినట్లు అధికారులు ప్రకటించారు. జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ ఫలితాలలో మొత్తం 804 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 700 మంది ఉత్తీర్ణతను సాధించి, 87 శాతం నమోదు చేశారన్నారు. ముప్పాళ్ల గురుకులం (100), కుంటముక్కల (98), రంగా పురం (97), నర్సాపురం (96), జగ్గయ్యపేట (95), బల్లిపర్ర (91) శాతం చొప్పున విజయాలను అందుకున్నాయన్నారు. సీనియర్‌ ఇంటర్మీడియెట్‌ ఫలితాలకు సంబంధించి మొత్తం హాజరైన విద్యార్థులు 944కాగా ఉత్తీర్ణులైన వారు 888 మొత్తం ఉత్తీర్ణత 94శాతంగా నమోదైంది.

కుంటముక్కల పాఠశాల బాలికల ప్రతిభ

జి.కొండూరు: ఇంటర్‌ ఫలితాల్లో కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్టేట్‌ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీలో 149 మంది విద్యార్థినులకు గానూ 146 మంది ఉత్తీర్ణత సాధించారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీలో 61మంది విద్యార్థినులకు గానూ 60 మంది ఉత్తీర్ణత సాధించారు. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో ఎంపీసీలో పి.కల్యాణిలక్ష్మి 988/1000 ప్రథమ స్థానం, ఎం.నవ్యశ్రీ 984/1000 ద్వితీయస్థానం, సీహెచ్‌ లక్ష్మీకీర్తన 982/1000 తృతీయ స్థానంలో నిలిచారు. సీనియర్‌ బైపీసీలో పి.భవానీ 985/1000, ఎం.జెస్సీకా 982/1000, డి.జాస్మిన్‌ శాంతిప్రియ 981/1000, సీఎస్‌ తనూజీ 981/1000 మార్కులతో మొదటి మూడు స్థానాలలో నిలిచారు. జూనియర్‌ ఎంపీసీలో బి.పూజిత 465, పి.నిఖిత 462, కె.సంజన 462, ఎ.దీపిక 460 మొదటి మూడు స్థానాలలో నిలిచారు. జూనియర్‌ బైపీసీలో ఎస్‌.శ్రీలక్ష్మి 451/455, ఇ.లాస్య 450, టి.ప్రియ 450, పి.అనితాబాయ్‌ 450, బి.సంధ్యన 448మార్కులతో సత్తా చాటారు.

Advertisement
 
Advertisement
Advertisement