స్థానిక సంస్థల నిర్వీర్యానికి కుట్రలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల నిర్వీర్యానికి కుట్రలు

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

● జెడ్పీకి రావాల్సిన నిధులను కావాలనే అడ్డుకుంటున్నారు ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీసిన చైర్‌పర్సన్‌ హారిక, సభ్యులు ● మొక్కజొన్న, మినుమును మద్దతు ధరకు కొనాలని ప్లకార్డులతో నిరసన ● పీఆర్‌ డీఈ నగేష్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జేసీ ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక విమర్శించారు. జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాలులో గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్‌పర్సన్‌ హారిక మాట్లాడుతూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా జిల్లా పరిషత్‌కు స్టాంప్‌ డ్యూటీ నిధులు రూ.23 కోట్లు రావాల్సి ఉండగా రెండేళ్లుగా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు రాక, చేసిన పనులకు ప్రారంభోత్సవాలు జరగక తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలామని, ఇలాంటప్పుడు స్థానిక సంస్థలను ప్రభుత్వం రద్దు చేస్తే బాగుంటుందని సూచించారు.

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి

ప్రస్తుత వేసవి నేపథ్యంలో ప్రజలకు సక్రమంగా తాగునీరు సరఫరా జరిగేలా చూడాలని చైర్‌పర్సన్‌ హారిక అధికారులకు సూచించారు. కో–ఆప్షన్‌ సభ్యుడు పరి శుద్ధ రాజు మాట్లాడుతూ.. తాగునీటి అవసరాలపై ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, తద్వారా సమ స్యను తక్షణం పరిష్కరించొచ్చని సూచించారు. కృత్తివెన్ను మండలంలో దాదాపు 30 గ్రామాల ప్రజలకు కలుషిత తాగునీరు అందుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్న కుమారి కోరారు. తాగునీరు కలుషితం కావటంతో ఆర్వో ప్లాంట్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారని, వాటిపై పర్యవేక్షణ కొరవడిందని పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ స్పందిస్తూ.. తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తా రని తెలిపారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ఫుడ్‌ సేఫ్టీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

అధికారుల గైర్హాజరు

జెడ్పీ సర్వసభ్య సమావేశానికి కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడు సబ్‌కలెక్టర్‌ వినూత్న తప్ప ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాకపోవ టంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాకుంటే తమ సమస్యలు ఎలా పరిష్కారమవు తాయని ప్రశ్నించారు. జెడ్పీ ద్వారా జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరుగుతాయని సభ్యులు ప్రశ్నించగా, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇచ్చిన తేదీల ప్రకారం నిర్వహిస్తామని అధికారులు బదులిచ్చారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం అధికారులు ఒక తేదీని నిర్ణయించి, సంబంధిత ప్రజాప్రతినిధులను పిలవా లని సూచించారు. ఈ సమయంలో చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. ‘జెడ్పీ ఆవరణలో నిర్మించిన వాణిజ్య సముదాయానికి ప్రజాప్రతినిధులను మీరే పిలవాలి’ అని పీఆర్‌ డీఈ నగేష్‌ తనతో చెప్పటంతో ఆశ్చర్యపోయానని అన్నారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను అధికారులు పిలవాలా లేక ఎవరు పిలవాలని ప్రశ్నించారు. పీఆర్‌ ఎస్‌ఈ రమణరావు మాట్లాడుతూ.. డీఈ పొరపాటుగా చెప్పారన్నారు. దీనిపై జేసీ స్పందించి డీఈ నగేష్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గూడూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ వేముల సురేష్‌, సంగా మధుసూదనరావు మాట్లా డుతూ.. పోసినవారిపాలెం, మల్లవోలు, రాయవరం గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించి ప్రారంభోత్సవం చేయకుండా నిలుపుదల చేశారని, వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవా లని కోరారు. జెడ్పీ వైస్‌చైర్మన్‌ గరికిపాటి శ్రీదేవి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలంలోని దావు లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తు న్నారని, ఈ ఇసుకను హైదరాబాద్‌ తరలించి అమ్ము కుంటున్నారని, అనుమతులు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. జేసీబీల ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని ఇలా అయితే ఆ ప్రాంత కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుందని నిలదీశారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్‌కలెక్టర్‌ వినూత్న, జెడ్పీ సీఈఓ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న, మినుమును మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ సభ్యులు పోడియం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. పెనుగంచిప్రోలు మండలంలో 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా, ప్రభుత్వం క్వింటా మద్దతు ధరను రూ.2,400గా నిర్ణయించిందని, దళారులు రూ.1600 మించి కొనడంలేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపురి గాంధీ సభ దృష్టికి తెచ్చారు. తక్షణం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జేసీ నవీన్‌ స్పందిస్తూ.. ప్రభుత్వానికి నివేదించామని ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కసారిగా సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ. రైతులంటే అంత చులకనా, మొక్కజొన్న, మినుము పంట లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఏమిటని ప్రశ్నించారు. కొద్దిసేపు పోడియం వద్ద పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని వివరించారు. పెనుగంచిప్రోలు మండలంలోని కొల్లికోళ్ల, 11 గ్రామాలకు వెళ్లే తాగునీటి పైప్‌లైన్‌ తరచూ పగిలిపోతోందన్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఈ పైప్‌లైన్‌ పగిలినప్పుడు సుమారు పది రోజులు తాగునీటిని సరఫరా నిలిపివేస్తున్నారని ఎంపీపీ గాంధీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక తవ్వకాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement