మహిళా సాధికారతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు ప్రాధాన్యం

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించామని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక పేర్కొన్నారు. జెడ్పీ ద్వారా 15 శాతం సీ్త్ర, శిశు సంక్షేమ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని గురువారం జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి హారిక ప్రారంభించారు. అనంతరం హారిక మాట్లాడుతూ.. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితం ఈ వాణిజ్య సముదాయానికి శంకుస్థాపన చేశామన్నారు. మహిళలు చిన్నస్థాయి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను వారికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మచిలీపట్నంలో పది, అవనిగడ్డలో 12 దుకాణాలను మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామన్నారు. త్వరలోనే బహిరంగ వేలం ద్వారా అర్హులైన వారికి దుకాణాలు కేటాయిస్తామన్నారు. ఈ వాణిజ్య సముదాయ నిర్మాణానికి సహకరించిన అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జె.అరుణ, డెప్యూటీ సీఈఓ ఆర్‌.సి.ఆనంద్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రమణారావు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి

మచిలీపట్నంఅర్బన్‌: స్థానిక నోబుల్‌ కళాశాలలో నిర్వహించిన ఇంట ర్మీడియెట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో పూర్తయినట్లు కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్‌ పరీక్షల అధి కారి ఎస్‌.సరళకుమారి తెలిపారు. మార్చి 25న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం 2,03,757 జవాబు పత్రాలను బోర్డు నిబంధనల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. 540 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 108 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 108 మంది స్క్రూటినైజర్లతో ఇరవై రోజుల పాటు మూల్యాంకనం నిర్వహించామని వివరించారు. సహకరించిన ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులకు సరళకుమారి కృతజ్ఞతలు తెలిపారు.

సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌

వినియోగాన్ని నిలిపివేయాలి

భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక హౌసింగ్‌బోర్డ్‌కాలనీలోగల అన్న క్యాంటీన్‌ను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్‌ జి.లక్ష్మీశ గురువారం పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలతో మాట్లాడి ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌ వెలుపల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీలో ప్లాస్టిక్‌ గ్లాసులను వినియోగించడాన్ని కలెక్టర్‌ గుర్తించారు. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగిస్తూ మజ్జిగ పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు.

హజ్‌ యాత్రకుప్రభుత్వ సన్నాహాలు

గన్నవరం: స్థానిక విమానాశ్రయం నుంచి ఈ నెల 18, 19 తేదీల్లో హజ్‌కు రాష్ట్రానికి చెందిన యాత్రికులు వెళ్లనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. స్థానిక ఎస్‌ఎం కన్వెన్షన్‌లో గురువారం హజ్‌ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ హాజీ షేక్‌ హసన్‌ బాషా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సీహెచ్‌.శ్రీధర్‌తో కలిసి హజ్‌ యాత్రికుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి ఫరూక్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన 337 మంది హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు తెలి పారు. యాత్రికులు ముందుకు క్యాంప్‌ వద్దకు చేరుకుంటారని, సదుపాయలను కల్పించాలని అధికారులు సూచించారు. తొలిరోజు హజ్‌ యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే మహ్మద్‌ నజీర్‌ అహ్మద్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement