జూద క్రాంతులు!
బరుల వద్దే బార్లు.. ● సంక్రాంతి సంబరాల పేరుతో విచ్చలవిడి
● ఓపెన్‌గానే కేసినో వంటి జూద క్రీడల నిర్వహణ
● ఏరులై పారిన మద్యం
● హైటెక్ హంగులతో బరుల్లో భారీ దోపిడీ
● కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం ● నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలంలో కీసర, గండేపల్లి, వీరులపాడు మండలంలో దాసవరం, నందిగామ మండలంలో రాఘవపురం గట్టు వద్ద, ఐతవరం మామిడి తోటలో, చందర్లపాడు మండలంలోని చందర్లపాడు గ్రామంలో అధికార పార్టీ నాయకులు భారీఎత్తున కోడిపందేలు, కేసినోలు నిర్వహించారు. ముఖ్యంగా గండేపల్లి మామిడితోట సమీపంలో గొట్టుముక్కల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చాగంటి సీతారామయ్య మూడు రోజుల పాటు గోవా తరహాలో కేసినో నిర్వహించారు. పేకాట రాయుళ్లకు ప్రతి అరగంటకు అల్పాహారం ఏర్పాటు చేయటంతో పాటు మాంసాహార భోజనాన్ని అందించారు. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు. కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జూదగాళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరిపారు. ఒక్కొక్క బాటిల్‌పై అదనంగా రూ.100లకు విక్రయించారు.
● గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, రామవరప్పాడు వద్ద టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో పందేలు రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో పేకాట, కేసినో నిర్వహించారు. రూ. 10 వేలు కట్టి ఎంట్రీ ఫీజు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్ ఇచ్చి లోపలికి అనుమతించారు. వీరికి అన్ లిమిటెడ్ మందు, ఆహారం సరఫరా చేశారు. కేవలం కోడి పందేల కోసం మరో మూడు చిన్న బరులు ఏర్పాటు చేశారు. ఇంకా లోపల బయట, గుండాట వంటి శిబిరాలు పదుల సంఖ్యలో ఏర్పాటు చేశారు. పాయకాపురం సమీపంలోనూ కేసినో శిబిరం నిర్వహించారు.
● పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు, పెద్దపులిపాక, కంకిపాడు మండలం ఈడుపుగల్లు, ఉప్పలూరు, కంకిపాడు, గొడవర్రు, ఉయ్యూరు మండలంలోని కాటూరు ఆకునూరు గ్రామాల్లో మొత్తం తొమ్మిది బరులు నిర్వహించారు. ఆకునూరు, ఉప్పులూరు గ్రామాల్లో కేసినో తరహా జూద క్రీడలు జరిపించారు. ఎంట్రీ టికెట్ లక్ష రూపాయల చొప్పున బరుల నిర్వాహకులు వసూలు చేశారు. మూడు రోజులు పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 200 కోట్ల పైగా వ్యాపారం సాగినట్టు సమాచారం.
● తిరువూరు నియోజకవర్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిపివేయడంతో భారీవాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అందరూ కుమ్మకై ్క..
బరుల వద్దే బార్లు..
విజయవాడ రామవరప్పాడు సమీపంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద పార్క్ చేసిన వాహనాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంక్రాంతి సంబరాల ముసుగులో హైటెక్ బరులు ఏర్పాటు చేసి, అడ్డగోలుగా పచ్చనేతలు కోట్లు దండుకున్నారు. మూడు రోజులూ రాత్రింబగళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా కోడిపందేలు, జూద క్రీడలు, కేసినో ఏర్పాటు చేశారు. కళ్లెదుటే పందెం పుంజులు కత్తులు దూస్తున్నా, పేకలు గాలిలో ఎగుతున్నా, చినబజారు, పెద్దబజారు, లోన, బయట, గుండాట, కోతముక్క, త్రీకాట్స్, ఆటలు జోరుగా ఓపెన్‌గా సాగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.
కేసరపల్లిలో చిన్నబజార్, పెద్ద బజార్ ఆడుతున్న పందెం రాయుళ్లు
నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బరుల కేటగిరీని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.2కోట్లకు పైగా దండుకున్నారు. పోలీసులు తామేమి తక్కువ కాదన్నట్లు బరుల వద్ద బేరం కుదుర్చుకున్నారు. దీంతో బరుల నిర్వాహకులు రెచ్చిపోయారు. తమకు అడ్డూ అదుపూ లేదన్నట్లు, రేకులతో పెద్ద, పెద్ద వాటర్ ప్రూఫ్ షెడ్‌లు ఏర్పాటు చేసి, అందులో సకల సౌకర్యాలు కల్పించారు. విచ్చలవిడిగా కేసినో నిర్వహించి రూ.కోట్లు కొల్లగొట్టారు. గోవా, నేపాల్ నుంచి నిపుణులను రంగంలోకి దించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం, లక్ష రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి మద్యం, విందు ఏర్పాటు చేశారు. వీరికోసం కారవ్యాన్‌లు కూడా అందుబాటులో ఉంచారు.
మద్యం మత్తులో ఘర్షణలు
బరుల వద్ద మద్యం ఏరులై పారింది. భారీ స్టాల్స్, బార్ల మాదిరి ఏర్పాటు చేసి జోరుగా మద్యం అమ్మకాలు చేశారు. భారీగా రేట్లు పెంచి సొమ్ము చేసుకున్నారు. కొంత మంది ద్విచక్రవాహనాలు, ఆటోల్లో పెట్టుకొని గ్లాసుల్లో మద్యం పోసి, మందు బాబులకు అమ్మకాలు చేశారు. ఆ పక్కనే బిర్యానీ సెంటర్లు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ పేరుతో భారీ దోపిడీకి తెగబడ్డారు. విజయవాడ శివారులో మూడు ప్రధాన బరుల వద్ద ద్విచక్ర వాహనానికి రూ.50, కార్లకు రూ.200 కేవలం మూడుగంటల సమయానికే తీసుకున్నారు. వేలాది వాహనాలు బరుల వద్ద బారులు తీరడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. కనీసం పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
1/1
జూద క్రాంతులు!