బెదిరింపులకు, అరెస్టులకు భయపడేది లేదు
పమిడిముక్కల(పామర్రు): పోలీసుల బెదిరింపులకు, కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు సరికాదన్నారు. కార్యకర్తలను రానివ్వకుండా రోప్‌లు అడ్డుపెట్టడం, పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, ప్రస్తుతం కూటమి పాలనలో తుపాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టం నమోదు చేయాలంటే టీడీపీ వారికే చేస్తున్నారని ఆరోపించారు. పంట నష్ట పరిహారం, దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని, మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ అక్రమ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
కై లే అనిల్‌కుమార్


