విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jul 28 2025 7:12 AM | Updated on Jul 28 2025 7:12 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025
దుర్గగుడి భూమిలో ‘రియల్‌’ మాయ!
అమ్మ భూమికి రక్షణ కరువు..
విద్యా అవస్థ!
ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలలకు తాళాలు

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

నిత్యాన్నదానానికి విరాళం

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన చిత్త శ్రీనివాసరావు, చాముండేశ్వరిల కుటుంబం రూ. లక్ష విరాళాన్ని అందజేసింది.

కొండలమ్మ సేవలో..

గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారిని చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక ఆదివారం దర్శించుకున్నారు. ఆమెను అమ్మవారి చిత్ర పటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.

సుబ్బారాయుడి సన్నిధిలో భక్తుల రద్దీ

మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఆలయం లోపల, వెలుపల కూడా క్యూలైనులో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. భక్తుల వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశం, ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆలయలో నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నీటి ట్యాంకర్‌ బహూకరణ

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రాచపూడి గ్రామానికి చెందిన ఉప్పటూరి చంద్రశేఖర్‌, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.2లక్షల విలువైన నీటి ట్యాంకర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆశీర్వచనం అనంతరం దాతలను ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ జంగాల శ్రీనివాసరావు, ఈఓ కిషోర్‌కుమార్‌, ఏఈ రాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

హాస్టళ్లలో సమస్యల

పరిష్కారానికి చర్యలు

బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు చంద్రశేఖరరాజు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు డి. చంద్రశేఖరరాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాక్షి పత్రిక ఈ నెల 27న హాస్టళ్లపై ప్రచురించిన వార్తకు ఆయన స్పందించారు. ఈ నెల మొదటి వారం నుంచి బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు విజయవాడ గుణదలలోని హాస్టల్‌తో పాటుగా పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లను సందర్శించారని పేర్కొన్నారు. ఆయా ప్రాంగణాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే బ్యాంకర్ల సాయంతో హాస్టల్‌లో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని పేర్కొ న్నారు. వసతులతో పాటుగా ఆహారం, భద్రత ఇతర అంశాల మెరుగునకు చర్యలు చేపట్టామని, వాటికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి నెలా ఒక హాస్టల్‌ను సందర్శించేలా ఆదేశించామన్నారు. వాటితో పాటుగా జేఎన్‌బీ నివాస్‌ పోర్టల్‌ ద్వారా హాస్టల్స్‌పై సమీక్ష, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని వివరించారు.

‘సృష్టికర్త శతకం’ ఆవిష్కరణ

విజయవాడ కల్చరల్‌: శతక సాహిత్యం విస్తృతం కావాలని సరస భారతి అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్‌ అన్నారు. రమ్యభారతి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బందరురోడ్డులోని రామ్మోహనరావు గ్రంథాలయంలో ఆదివారం తుమ్మోజు రామలక్ష్మణాచారి రచించిన ‘సృష్టికర్త శతకం’ ఆవిష్కరణ సభను నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ శతకం తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అన్నారు. శతకాలు నేటి బాలబాలికలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జీవీ పూర్ణచందు మాట్లాడుతూ సృష్టికర్త శతకం సామాజిక అంశాల సమాహారమన్నారు. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యం మకుటాయమానమైందని చెప్పారు. వేములపల్లి కేశవరావు శతక సాహిత్యాన్ని వివరించారు. రమ్యభారతి సాహిత్యవేదిక వ్యవస్థాపక కార్యదర్శి చలపాక ప్రకాష్‌ నిర్వహించారు. శతక రచయిత రామలక్ష్మణాచారి శతక రచనకు ప్రేరణ కలిగించిన అంశాలను తెలిపారు. ఆవిష్కరణ సభలో గోళ్ల నారాయణరావు, జర్నలిస్ట్‌ శర్మ, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి విజయవాడ/కంకిపాడు: రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు దేవుడి భూములనూ వదలడం లేదు. దర్జాగా ఆక్రమించేస్తున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన భూములు ఆ సంస్థ చేతిలో ఫలహారాలుగా మారుతున్నాయి. అందుకు ఉదాహరణే దుర్గమ్మ భూమి అన్యాక్రాంతం వ్యవహారం. ఇదీ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా.. దేవదాయశాఖ నేటికీ చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది. దుర్గగుడి దేవస్థానం అధికారులు కేవలం లేఖలు పంపి చేతులు దులుపుకొన్నారు. రెవెన్యూ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విచారణ నెలల తరబడి సాగుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఎంచక్కా తమపని కానిచ్చేస్తున్నాయి.

దారీ తెన్నూ లేని భూముల అమ్మకం..

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామ పరిధిలో 242 నుంచి 268 ఎల్‌పీఎం నంబర్లలో శ్రీసిటీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 21.36 ఎకరాల్లో ప్లాట్లు వేసింది. హరివిల్లు వెంచరుకు తూర్పు వైపు నుంచి దేవుడి భూమిలో అనధికారికంగా రోడ్డు నిర్మించారు. ఈ వెంచర్‌ను సుమారు 265 ప్లాట్లుగా విభజించారు. ఇప్పటికే 150కిపైగా ప్లాట్‌లు ప్రీ బుకింగ్‌ అయినట్లు మార్కెటింగ్‌ ఏజెంట్లు చెబుతున్నారు. గజం రూ.17వేల చొప్పున విక్రయిస్తున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఈ వెంచర్‌కు సమీపంలో వస్తోందని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. సంస్థ యజమానికి ఉన్న పరపతి దృష్ట్యా 20 రోజుల్లో సీఆర్‌డీఏ అనుమతులు వస్తాయని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో భూముల ధర పెరుగుతుందని నమ్మబలికి ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్నారు. త్వరితగతిన ప్లాట్లు బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. దారితెన్నూ లేని ప్లాట్‌లను కొనుగోలు దారులకు కట్టబెట్టేయత్నం చేస్తున్నారు.

గ్రామస్తుల ఫిర్యాదుతో..

అధికారంలో ఉన్న పచ్చ నేతల అండతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సదరు వెంచరులోకి వెళ్లేందుకు దేవుడి భూమిలో రహదారిని నిర్మించి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ రోడ్డు నిర్మాణ అంశం మొదట్లోనే వివాదాస్పదం అయ్యింది. రహదారి నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోనిదని కొందరు, కన్యకా పరమేశ్వరీ సత్రానికి చెందినదిగా కొందరు చెబుతున్నారు. నెప్పల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఈ భూమి వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ సహా, దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయటంతో విషయం వెలుగుచూసింది. ఫిర్యాదులతో కదిలిన దేవదాయశాఖ అధికారులు ఈ ఏడాది మే నెలలో సదరు భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు. సర్వే నంబర్‌ 101లో 4.41 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆర్‌ఎస్‌ఆర్‌లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగానూ, అడంగల్‌లో కన్యకాపరమేశ్వరీ సత్రం భూమిగా నమోదై ఉంది. రెండు రికార్డుల్లో రెండు విధాలుగా నమోదై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

మచిలీపట్నంఅర్బన్‌: కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ జిల్లాలోని విద్యా వ్యవస్థను తారుమారు చేసింది. మొత్తం పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజించింది. ఉమ్మడి కృష్ణాలోని మొత్తం 2,710 ప్రభుత్వ పాఠశాలలను 2,687కి కుదించింది. అంటే 23 పాఠశాలలు మాయ మయ్యాయి. అంతేకాక కొన్ని ప్రాంతాల్లోని పాఠ శాలల్లో తరగతులు తగ్గించింది. ఈ చర్యలతో విద్యా ర్థులు పూర్తిస్థాయిలో ప్రాథమిక విద్యను పొందేందుకు పాఠశాల మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొత్త వ్యవస్థ ఇలా..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూతన విధానంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలను పలు విభాగాలుగా విభజించింది. అవి బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌, అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలు, బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌ గ్రేడ్‌ చేసినవి, మోడల్‌ ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌ గ్రేడ్‌ చేసినవి, ఫౌండేషనల్‌ పాఠశాలలు, హై స్కూల్స్‌, హై స్కూల్స్‌/బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌, హై స్కూల్స్‌/మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌, మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌, శాటిలైట్‌ స్కూల్స్‌, అప్‌గ్రేడ్‌ చేసిన హై స్కూల్స్‌ ప్లస్‌ కొత్త బేసిక్‌ ప్రైమరీ పాఠశాలలు, అప్‌ గ్రేడ్‌ చేసిన హై స్కూల్స్‌ ప్లస్‌ కొత్త మోడల్‌ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేసింది.

ఎన్టీఆర్‌లో అధిక స్కూల్స్‌ డౌన్‌గ్రేడ్‌..

ఉమ్మడి కృష్ణాలో 2,687 పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో 863 ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్నవే. ఇందులో అత్యధికంగా 83 పాఠశాలలు డౌన్‌గ్రేడ్‌ చేయడం గమనార్హం. మోడల్‌ స్కూల్స్‌ ఏర్పాటు పేరుతో పాత పాఠశాలలు మూతపడినట్టే అయిందని పలువురు అంటున్నారు.

మోడల్‌ స్కూల్స్‌పై విమర్శలు..

జిల్లాలో ఏర్పాటు చేసిన 453 మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌లో 208 ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్నాయి. పాత చిన్న స్కూల్స్‌ను కలిపి పెద్ద స్కూల్స్‌గా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తున్నప్పటికీ స్పష్టత లేకపోవడం, తల్లిదండ్రుల అసంతృప్తి, ప్రయాణ భారం తదితర అంశాలు కొత్త సమస్యలుగా మారాయి.

విద్యార్థుల సంఖ్యపై తీవ్ర ప్రభావం..

●ప్రస్తుత కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన 653 బేసిక్‌ ప్రైమరీ, 94 అప్పర్‌ ప్రైమరీ, 129 ఫౌండేషనల్‌, 141 హై స్కూల్స్‌, 50 హై స్కూల్‌/బేసిక్‌ ప్రైమరీలు, 03 హై స్కూల్‌/మోడల్‌ ప్రైమరీలతోపాటు, మరో 15 బేసిక్‌ ప్రైమరీ, 01 మోడల్‌ ప్రైమరీ పాఠశాలను డౌన్‌గ్రేడ్‌ చేశారు. ఇదే సమయంలో 04 హై స్కూల్‌ ప్లస్‌ న్యూ బేసిక్‌ ప్రైమరీలు, 28 హై స్కూల్‌ ప్లస్‌ మోడల్‌ ప్రైమరీలు అప్‌ గ్రేడ్‌ అయ్యాయి. అంతేకాక 198 మోడల్‌ స్కూల్స్‌, 01 శాటిలైట్‌ స్కూల్‌ను ప్రారంభించినా, వీటి ద్వారా ఆశించిన ప్రయోజనం దక్కకపోవడం గమనార్హం. ఇవి విద్యా అవసరాల ప్రకారం కాక, గణాంకాల సమన్వయం కోసమే జరిపినవిగా తెలుస్తోంది. డౌన్‌గ్రేడ్‌, అప్‌గ్రేడ్‌ పేరుతో ప్రాథమిక పాఠశాలల విలీనానికి దారితీసిన ఈ చర్యలు, ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులే లేని పరిస్థితికి చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనా 141 పాఠశాలల్లో మొదటి తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్న విషయం కలవరపెడుతోంది.

●ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 276 బేసిక్‌ ప్రైమరీ, 208 మోడల్‌ స్కూల్స్‌, 117 ఫౌండేషనల్‌, 139 హై స్కూల్స్‌, 01 శాటిలైట్‌ స్కూల్‌ ఏర్పాటు కాగా 54 బేసిక్‌ ప్రైమరీ, 29 మోడల్‌ ప్రైమరీ పాఠశాలలను డౌన్‌గ్రేడ్‌ చేయడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తోంది. మరో వైపు 05 హై స్కూల్‌ ప్లస్‌ బేసిక్‌ ప్రైమరీలు, 16 హై స్కూల్‌ ప్లస్‌ మోడల్‌ ప్రైమరీలు ఏర్పాటయ్యాయి. చిన్న పిల్లలు పెద్ద విద్యాసంస్థల్లో కలిసిపోయే పరిస్థితులు, ఉపాధ్యాయుల సంఖ్యలో అసమతుల్యత విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

7

న్యూస్‌రీల్‌

లేఖలతో సరి..

‘సాక్షి’లో వచ్చిన కథనాలపై విజయవాడ కనకదుర్గగుడి దేవస్థానం ఈఓ స్పందించి రెవెన్యూ రికార్డులను సరిచేసి అమ్మవారి భూమిని అమ్మవారికి చెందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖలు పంపారు. ఆర్‌ఎస్‌ఆర్‌కు అనుగుణంగా అడంగల్‌లో మార్పులు చేయాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇందుకు దేవదాయశాఖ తమ పరిధిలోని 43 ప్రాపర్టీ రిజిస్టర్‌లో భూ వివరాలను ఆధారాలతో సహా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు అప్పగించాలి. ఆ దిశగా చర్యలు మాత్రం ముందుకు సాగటం లేదు.

ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇష్టారాజ్యం తన వెంచర్‌ కోసం అమ్మవారి భూమిలో అడ్డంగా రోడ్డు నిర్మాణం గ్రామస్తులు అభ్యంతరాలు చెప్పి, ఫిర్యాదులు చేసినా పట్టని వైనం విచారణ పేరుతో కాలం గడుపుతున్న దేవదాయశాఖ లేఖలతో సరిపెడుతున్న దుర్గగుడి దేవస్థానం మరోవైపు రింగ్‌ రోడ్డు పేరుతో యథేచ్ఛగా ప్లాట్ల అమ్మకాలు చేస్తున్న సంస్థ

వైఎస్సార్‌ సీపీ హయాంలో సమగ్ర పాఠశాలలు..

గత ప్రభుత్వ హయాంలో 2,710 పాఠశాలల్లో 1,972 ప్రాథమిక స్థాయిలో, 665 పాఠశాలలు ప్రైమరీ/అప్పర్‌, ప్రైమరీ సెకండరీ కలయికగా ఉండగా, 73 హయ్యర్‌ సెకండరీ స్థాయికి ఎదిగినవిగా ఉండేవి. దీంతో విద్యార్థుల విద్యా ప్రయాణం ఒకే ప్రాంగణంలో కొనసాగే అవకాశముండేది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో..

గత ప్రభుత్వంలో

మొత్తం స్కూళ్లు: 2,710

ప్రస్తుతం ఉన్న స్కూళ్లు: 2,687

మూతపడ్డవి: 23

మార్పుల పేరుతో గందరగోళం 9 రకాలుగా స్కూళ్ల విభజన కొన్ని తరగతులకే పాఠశాలలు పరిమితం పాఠశాలల్లో భారీగా తగ్గిపోయిన కొత్త అడ్మిషన్లు

విలీనం చేశాం..

జిల్లాలో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదు. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా సమర్థంగా పాఠశాలలు విలీనం చేశాం. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సదుపాయాలు, మౌలిక వనరుల ఆధారంగా సమీప పాఠశాలలతో విలీనం చేయడం ద్వారా బోధనా నాణ్యత పెరుగుతుంది. మార్పు వల్ల విద్యార్థులకు మెరుగైన వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, విద్యా పరిరక్షణకు తగిన నిబంధనలు అమలవుతాయి.

– పీవీజే రామారావు, డీఈఓ, కృష్ణాజిల్లా

నూతన విధానం ప్రకారం కొత్త జిల్లాల వారీగా స్కూళ్ల వివరాలు..

పాఠశాల రకం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్‌ మొత్తం

బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌(బీపీఎస్‌) 248 653 276 1,177

అప్పర్‌ స్కూల్‌గా కొనసాగే స్కూళ్లు 40 94 9 143

బేసిక్‌ ప్రైమరీకి డౌన్‌ గ్రేడ్‌ చేసిన స్కూళ్లు 17 15 54 86

మోడల్‌ ప్రైమరీ స్కూల్‌(ఎంపీఎస్‌)గా

డౌన్‌ గ్రేడ్‌ చేసిన స్కూళ్లు 7 1 29 37

ఫౌండేషన్‌ స్కూళ్లు 67 129 117 313

హై స్కూళ్లు 44 141 139 324

హై స్కూల్‌/బీపీఎస్‌ 21 50 9 80

హై స్కూల్‌/ఎంపీఎస్‌ – 3 – 3

మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ 47 198 208 453

శాటిలైట్‌ స్కూల్‌ 5 1 1 7

హైస్కూల్‌ ప్లస్‌ కొత్త బీపీఎస్‌గా

అప్‌ గ్రేడ్‌ అయిన స్కూళ్లు 4 4 5 13

హైస్కూల్‌ ప్లస్‌ కొత్త ఎంపీఎస్‌గా

అప్‌గ్రేడ్‌ అయిన స్కూళ్లు 7 28 16 51

మొత్తం 507 1,317 863 2,687

చీమలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం

తిరువూరు: ఎ.కొండూరు మండలం చీమలపాడులో విష జ్వరాలు వ్యాపిస్తుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు పద్మావతి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుహాసిని ఆదివారం చీమలపాడును సందర్శించి 40 మంది ఆరోగ్య సిబ్బందితో 15 వైద్య బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలో జ్వర పీడితుల సర్వే నిర్వహించారు. గ్రామంలోని పబ్లిక్‌, ప్రైవేటు మంచినీటి కుళాయిలు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల వద్ద పరిసరాలు శుభ్రం చేయించారు. నీటి తొట్టెలు, కొబ్బరిబోండాలు, పూలకుండీలలో నీరు నిల్వ ఉంచవద్దని, వీటిలో దోమ లార్వా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్తులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో సుహాసిని సూచించారు. ఎ. కొండూరు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు స్వాతి, దివ్య, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.

గ్రామంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.5 కోట్లకు పైగా పలుకుతోంది. దీనికి తోడు ఇటీవల ఓఆర్‌ఆర్‌ గ్రామం వెంబడిగా వెళ్తోందన్న ప్రచారంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మట్టికి బంగారం కంటే ఎక్కువ డిమాండ్‌ పెరిగింది. అమ్మవారి భూమిగా చెబుతున్న భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 25 కోట్లకు పైగా పలుకుతోంది. దారీతెన్నూ లేని భూమిని కొనుగోలు చేసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తమ భూమిలోకి వెళ్లేందుకు అమ్మవారి భూమిలో నుంచి దారిని దర్జాగా నిర్మించేసింది. దేవదాయశాఖ అధికారులు మాత్రం ఈ భూమి ముమ్మాటికీ దేవదాయశాఖదే అని తేల్చారు. కానీ దాని స్వాధీనం విషయంలో మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారులు భూ పరిశీలనకే పరిమితం అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయశాఖ మెతక వైఖరి కారణంగా రియల్‌ సంస్థ ప్రతినిధులు వెంచరులో రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా చేపడుతున్నారు. ప్రహరీ, కాంక్రీటు పను లు పూర్తి చేస్తున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయవాడ సిటీ1
1/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ11
11/11

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement