Telangana Cultural Society : ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Telangana Cultural Society Organized Ganesh Chaturthi Puja In Singapore - Sakshi

తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS-(సింగపూర్) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలగి అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా నుండి కాపాడాలని కోరారు. 
  
ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు. ఈ  పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నడికట్ల భాస్కర్, నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు. 

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త  నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి  వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ లు  సంబరాల్లో పాల్గొన్న భక్తులకు  ధన్యవాదాలు తెలిపారు.  అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని  ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top