TANA: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం

TANA Chaitanya Sravanthi 2022: Free Medical Mega Camp in Gudivada - Sakshi

గుడివాడ (కృష్ణా జిల్లా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రోటరీ క్లబ్ సహాయంతో కళ్లు, ఈఎన్‌టీ, కేన్సర్ క్యాంప్‌ చేపట్టారు. స్కూల్ విద్యార్దినిలకు తానా చేయూత ద్వారా 55 మందికి స్కాలర్‌షిప్‌లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్‌లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ అందజేశారు. శశికాంత్ వల్లేపల్లి తన తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి వైకుంఠ రథం బహూకరించారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, టీఎన్‌ఐ లైవ్‌ ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను సత్కరించారు.


తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఈ సందర్భంగామాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలోని తెలుగువారికి ఆపద, విపత్కర సమయాల్లో ఏ విధంగా సహాయం చేస్తున్నామో తానా సెక్రెటరీ సతీష్ వేమూరి వివరించారు.


తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజా, గుడివాడ రోటరీ క్లబ్ పాలక సభ్యులు  పాల్గొన్నారు. అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులు శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, శ్రీమతి ఉమా కటికి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, డాక్టర్‌ రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. (క్లిక్: హైదరాబాద్‌లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top