చంద్రబాబు ఫ్రెండ్‌ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు | Singapore's ex-transport minister S Iswaran faces eight more corruption charges - Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఫ్రెండ్‌ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు

Mar 26 2024 12:20 PM | Updated on Mar 26 2024 2:10 PM

New Cses On Singapore Former Minister S Iswaran  - Sakshi

సింగపూర్ సిటీ: భారత సంతతికి చెందిన సింగపూర్‌ మాజీ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న ఎస్.ఈశ్వరన్ (61)పై కొత్తగా ఎనిమిది అవినీతి కేసులు దాఖలయ్యాయి. దీంతో.. జనవరిలో మోపిన 27 అభియోగాలతో కలుపుకొని మొత్తం 35 కేసుల్ని ఈశ్వరన్ ఎదుర్కొంటున్నారు. కోర్టు అనుమతితో ఆస్ట్రేలియాకు వెళ్లివచ్చిన వారం రోజులకే ఈశ్వరన్‌పై కొత్త ఆరోపణలు దాఖలు కావడం గమనార్హం.

లుమ్ కోక్ సంగ్ అనే బిల్డర్ నుంచి ఖరీదైన విస్కీ సీసాలు, గోల్ఫ్ సాధనాలు, సైకిల్‌ను లంచంగా తీసుకున్నట్లు ఈశ్వరన్‌పై తాజా ఆరోపణలు వచ్చాయి. ఆయన గతంలో అంగ్ బెంగ్ సెంగ్ అనే మరో బిల్డర్ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలన్నింటిలో తాను నిర్దోషినని ఈశ్వరన్ వాదిస్తున్నారు.

ఇదీ చదవండి: బాబు తోడుదొంగ ఈశ్వరన్‌ ఔట్‌ 

ఇదీ చదవండి: ఎట్టకేలకు సుబ్రమణియం ఈశ్వరన్‌ రాజీనామా

Advertisement
 
Advertisement
Advertisement