న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ | NATS Food Drive In New Jersey | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్

May 9 2022 5:28 PM | Updated on May 9 2022 5:36 PM

NATS Food Drive In New Jersey - Sakshi

ఎడిసన్ (న్యూ జెర్సీ): భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్‌ను దిగ్విజయంగా నిర్వహిస్తోంది. నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నాట్స్ న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 500  పౌండ్ల ఆహారాన్ని, ఫుడ్ క్యాన్స్‌ను సేకరించి పేదలకు పంపిణి చేసింది. న్యూజెర్సీలో  ఆరవ సారి నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. కోవిడ్ కారణంతో గత రెండేళ్ల ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. కోవిడ్ కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్ పుంజుకోవడంతో నాట్స్ సభ్యులు ఉత్సాహంగా ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొని తమకు తోచినంత ఫుడ్ క్యాన్స్‌ను విరాళంగా ఇచ్చారు.

ఈ పుడ్ డ్రైవ్‌కు నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ మాజీ అధ్యక్షులు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ బోర్డ్ సెక్రటరీ శ్యాం నాళం, బోర్డ్ డైరెక్టర్స్ శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ సూర్య శేఖర్ గుత్తికొండ, రమేశ్ నూతలపాటి, రాజేశ్ బేతపూడి, గిరి కంభంమెట్టు తదితరులు తమ మద్దతు అందించారు. నాట్స్ న్యూజెర్సీ కో ఆర్డినేటర్ సురేశ్ బొల్లు, జాయింట్ కోఆర్డినేటర్ మోహన కుమార్ వెనిగళ్ల, ఈవెంట్ కమిటీ శేషగిరి కంభంమెట్టు, కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ అరుణ్ శ్రీరామినేని, వంశీ కొప్పురావూరి, కిరణ్ కుమార్ తవ్వ, ప్రశాంత్ లు ఈ పుడ్ డ్రైవ్ విజయవంతానికి కృషి చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement