ఇండియన్లకు కువైట్‌ షాక్‌ ! టూరిస్టు వీసా జాబితాలో మొండి చేయి

Kuwait tourist e Visa India Did not Got a Chance In list - Sakshi

భారతీయ పర్యాటకులకు కువైట్‌ ప్రభుత్వం మొండి చేయి చూపింది. టూరిస్టు వీసాల జారీకి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో కువైట్‌ దేశానికి వచ్చేందుకు ఇటీవల 53 దేశాలకు చెందిన పౌరులకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)లో సభ్యత్వం ఉన్న దేశాల్లో గత ఆర్నెళ్లుగా నివసిస్తున్న విదేశీ ‍ప్రొఫెషనల్స్‌కి టూరిస్టు వీసాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు కువైట్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ఇ వీసాలు వీటిని జారీ చేయనుంది. అయితే టూరిస్టు వీసాలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను మినహాయించింది. కువైట్‌లో వలస కార్మికులతో పాటు పెద్ద ఎత్తున్న ప్రొఫెషనల్స్‌ అక్కడ పని చేస్తున్నారు. అయినప్పటికీ భారత్‌కు వీసాలు జారీ చేసే విషయంలో కువైట్‌ భారత్‌ని పక్కన పెట్టింది.

కువైట్‌  ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం... 53 దేశాలకు చెందిన వారికి ఈ వీసాలు జారీ చేసేందుకు అంగీకారం తెలపగా ఇందులో మెజారిటీ దేశాలు యూరప్‌, అమెరికా ఖండాలకు చెందినవే ఉన్నాయి. ఏషియాకు సంబంధించి జీసీసీ సభ్యదేశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. జీసీసీ సభ్యదేశాలల్లో ఉన్న కన్సల్టెంట్స్, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, జడ్జిలు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు, యూనివర్శిటీ అధ్యాపకులు, ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సీస్టం అనలిస్ట్స్, మేనేజర్స్, వ్యాపారవేత్తలు, దౌత్య దళం, యూనివర్శిటీ గ్రాడ్యుయేట్స్, సౌదీ ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు కువైట్‌ టూరిస్టు వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  అయితే వీరు జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్‌లలో ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉండాలనే నిబంధన విధించింది. 

చదవండిSaudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top