
పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతి కార్యక్రమాన్ని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించారు. ఏడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్, అమెరికా, భారతదేశాలకు చెందిన వక్తలు గాయనీమణులు పాల్గొన్నారు.
వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వసంత ప్రచురణగా 17 దేశాలకు చెందిన 250 మంది కవయిత్రులు రచించిన కవితా మేఘమాల అనే కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆవిష్కరించారు. దేవులపల్లి రచించిన సినిమా పాటలను ఆలనాటి నటి అలనాటి నటీమణి జమునా తలచుకుని ప్రసంగించారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. సింగపూర్ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలగడం తమ అదృష్టమన్నారు. వంశీ అధ్యక్షులు రామరాజు మాట్లాడుతూ.. దేవులపల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు లలిత రామ్ అందించిన ఆర్ధిక సహకారంతో, కవితా మేఘమాల సంకలనాన్ని ప్రచురించామన్నారు
ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత, రాధిక మంగిపూడి, కలపటపు లక్ష్మీ ప్రసాద్‌లతో పాటు దేవులపల్లి కుటుంబ సభ్యులు లలితారామ్, రత్నపాప, సీతా రత్నాకర్, శారద తదితరులు పాల్గొన్నారు.