నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 30 2026 12:52 AM | Updated on Nov 30 2026 12:52 AM

విచారణ చేయిస్తా

న్యూస్‌రీల్‌

తనిఖీల మాటున

సాక్షి స్పెల్‌ బీ..

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘సాక్షి’ నిర్వహించిన స్పెల్‌ బీ కాంపిటేషన్‌కు విశేష స్పందన లభించింది.

సోమవారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందంలో కొందరు సిబ్బంది ‘చేతివాటం’ ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిబంధనల ప్రకారం తనిఖీలు నిర్వహించాల్సిన సిబ్బంది, కాసులకు కక్కుర్తి పడి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తులున్నాయి. డీఎఫ్‌వో ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్‌ షాపులు, టింబర్‌ డిపోలు, సామిల్లులపై టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు చేయడంతోపాటు తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే తనిఖీల సమయంలో కొందరు సిబ్బంది లేని లొసుగులను వెతుకుతూ యజమానులను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తూ, ఫైన్‌ల పేరిట బేరసారాలకు దిగుతూ తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూలు చేసిన దాంట్లో సగం డబ్బులకే ఫైన్లు వేసి రసీదులు ఇస్తున్నారని, మిగతా మొత్తాన్ని వారే మెక్కుతున్నారనే విమర్శలున్నాయి. అయితే అవినీతిని ఏమాత్రం సహించని డీఎఫ్‌వో, ఎంతో నమ్మకంతో ఏర్పాటు చేసిన ఈ బృందంలో కొందరి తీరు ఆయన ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా మారిందనే చర్చ శాఖలో నడుస్తోంది. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఓ అధికారితో పాటు ఇద్దరు ముగ్గురు బీట్‌ ఆఫీసర్లు, అలాగే గతంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో పని చేసిన అనుభవం ఉన్న ఓ వ్యక్తి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

టాస్క్‌ఫోర్స్‌ టీమును ఏర్పాటు చేసినప్పుడే బాధ్యతగా పని చేయాలని, అవినీతి ఆరోపణలు రాకూ డదని సిబ్బందికి హెచ్చరించా. తనిఖీల సమయంలో జరిమానాల పేరుతో ఎక్కువ వసూలు చేసి రసీదుకు తక్కువ చూపిస్తున్నట్లుగా నా దృష్టికి రాలేదు. ఇలాంటి విషయాలను ఉపేక్షించేది లేదు. క్షేత్రస్థాయిలో విచారణ చేయించి వాస్తవాలను తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటా.

– ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, జిల్లా అటవీ అధికారి

రూ.15వేలు తీసుకుని... రూ.8వేలకే రసీదు

ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓ మండలానికి ఇటీవల వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది.. ఓ కార్పెంటర్‌ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. అటవీ నిబంధనలకు విరుద్ధంగా కలప ఉందంటూ యజమాని నుంచి ఏకంగా రూ.30 వేలు డిమాండ్‌ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన దుకాణాన్ని ఎక్కడ మూసేస్తారోనన్న భయంతో యజమాని రూ.15 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. కానీ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది జరిమానా కింద కేవలం రూ.8 వేలు మాత్రమే వేసి యజమానికి రసీదు ఇచ్చారు. రూ.15వేలు తీసుకుని, రూ.8 వేలకే రసీదు ఎందుకిచ్చారు? అని సదరు యజమాని ప్రశ్నించగా... ‘మా ఖర్చులు మాకుంటాయి’ అంటూ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అన్నట్లుగా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో దాదాపు ఇదే తంతు నడుస్తోందని, ఎక్కువ డబ్బులు వసూలు చేసి తక్కువ ఫైన్‌ల రాస్తున్నారని పలు కార్పెంటర్‌ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వసూలు ఎక్కువ... రసీదుకు తక్కువ

అటవీ టాస్క్‌ఫోర్క్‌ సిబ్బందిపై

వసూళ్ల ఆరోపణలు

జరిమానాల పేరిట కార్పెంటర్‌ షాపులు, టింబర్‌ డిపోల్లో బేరసారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement