● హెచ్‌ఆర్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బదావత్ రాజు
● బోధన్‌లో మానవ హక్కుల వేదిక
జిల్లా 8వ మహాసభ
బోధన్ : సమాజంలో వ్యవస్థీకృతమైన అన్ని విధాల అసమానతలు, అణచితవేతను వ్యతిరేకి స్తూ నిరంతర పోరాటం కొనసాగిస్తున్నామని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్– హ్యు మన్ రైట్స్ ఫోరం) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్ రాజు అన్నారు. పౌరసమాజం కోల్పోతున్న హ క్కులను కాపాడుకునేందు కు కలిసికట్టుగా పోరాడాలన్నారు. బోధన్‌లోని ల యన్స్ కంటి ఆస్పత్రి మీటింగ్ హాల్‌లో హెచ్‌ఆర్‌ఎఫ్ జిల్లా 8వ మహాసభను వేదిక జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. వేదిక రాష్ట్ర కార్యదర్శులు షేక్ అహ్మద్, హరిక్రి ష్ణ, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి, సంగం, వినియోగదారుల ఫోరం విశ్రాంత సభ్యుడు శంకర్‌రావు హాజరై ప్రసంగించారు. హక్కుల తాత్విక దృక్పథం కలిగిన హెచ్‌ఆర్‌ఎఫ్ ఏరాజకీయ భావజాలం పరిధిలో పని చేయదని స్పష్టం చేశారు. ముందుగా వేదిక అగ్రనాయకులు కె.బాలగోపాల్, జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది,వేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావులకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి జి రమేశ్ రెండేళ్ల కార్యక్రమాల నివేదికను వివరించారు. వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు రచించిన జీవన స్మృతులు, వీధిబతుకులు విస్థాపనలు పుస్తకాలను, వేదిక రాష్ట్ర ఉభయ రాష్ట్రాల కరపత్రాలను ఆవిష్కరించారు. వేదిక జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు గడ్డం గంగులు, గొంట్యాల రమేశ్, ప్రతినిధులు, సభ్యు లు మీనా సహానీ, వేములపల్లి అరుణ రేఖ, జగన్, ఆకుల సత్యనారాయణ, జి శ్రీనివాస్, రామా గౌడ్, బాబాగౌడ్, అరుణ్, అన్వేష్, మారుతి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


