ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష

Nov 30 2026 12:52 AM | Updated on Nov 30 2026 12:52 AM

ఖలీల్‌వాడి : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 6807 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని 20 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా 6,258 మంది హాజరయ్యారు. 549 మంది గైర్హాజరయ్యారు. ఉద యం 9 నుంచి అభ్యర్థులు సెంటర్ల వద్ద బారులు తీరగా, పోలీసులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. పలు పరీక్షాకేంద్రాలను సీపీ సాయిచైతన్య సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌) పి రామ్మోహన్‌రెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌ అదనపు డీసీపీ(అడ్మిన్‌) ఎన్‌ శుభం ప్రకాశ్‌ అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలు చేశారు.

రిజిస్ట్రేషన్‌లు 6807..

పరీక్షకు హాజరైన వారు 6,258 మంది

549 మంది గైర్హాజరు

ఆలస్యంగా వచ్చిన ఇద్దరికి

అనుమతి నిరాకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement