హెచ్‌ఎం స్కూల్ ఆన్ బోర్డింగ్
స్కూల్స్ స్క్రీనింగ్ స్టేటస్
● రెండు అంశాల్లో రాష్ట్రంలోనే ఫస్ట్
ఆర్మూర్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులను గుర్తించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రశస్త్ (ప్రీ అసెస్‌మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్)లో జిల్లా మెరుగైన ప్రగతి సాధించినట్లు ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్, జిల్లా ఐఈ కో ఆర్డినేటర్ పడకంటి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆదివారం నాటికి నమోదైన గణాంకాల ప్రకారం రెండు అంశాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. ట్యుటోరియల్ కంప్లీషన్, స్కూల్స్ స్క్రీనింగ్‌లో మొదటి స్థానంలో, మిగతా రెండు అంశాల్లోనూ 97 శాతం పైగా సాధించడంపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్యుటోరియల్ కంప్లీషన్
21 వైకల్యాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ ప్రశస్త్ యాప్‌లో వీడియోలు చూపించే మొదటి కార్యక్రమంలో జిల్లా 98.97 శాతం పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 15,683 మంది ఉపాధ్యాయులకుగాను 15,522 మంది పూర్తి చేశారు. చివరి స్థానంలో 68.29 శాతంతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
నాన్ టీచింగ్ స్టాఫ్ వీడియో స్టేటస్
దివ్యాంగులపై అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ వీడియోలు చూసే కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,824 పాఠశాలలకుగాను 1,779 పాఠశాలల్లో పూర్తయి 97.59 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఖమ్మం జిల్లా 99.75 శాతంతో, చివరి స్థానంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 26.14 శాతం నిలిచాయి.
ప్రధానోపాధ్యాయులు ప్రశస్త్ యాప్‌లో లాగిన్ అయ్యే కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,844 పాఠశాలలకు గాను 1,819 పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు ఆన్‌బోర్డ్ అయి 98.64 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మెదక్ జిల్లా 99.53 శాతం, చివరి స్థానంలో రంగారెడ్డి జిల్లా 71.45 శాతంతో నిలిచాయి.
పాఠశాలల్లోని ప్రతి విద్యార్థిలో సామర్థ్యాలను తెలుసుకునే క్రమంలో నిర్వహించే పార్ట్ 1 స్క్రీనింగ్‌లో నిజామాబాద్ జిల్లా 99.9 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 3,27,980 మంది విద్యార్థులకు గాను 3,27,622 మంది స్క్రీనింగ్ పూర్తయ్యింది. చివరి స్థానంలో రంగారెడ్డి జిల్లా 36.6 శాతంతో నిలిచింది.


