● విజేతగా నిలిచిన వర్సిటీ జట్లు
● త్వరలో సౌత్‌జోన్ ఇంటర్
యూనివర్సిటీ పోటీలకు జట్ల ఎంపిక
తెయూ(డిచ్‌పల్లి): గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల క్రికెట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. క్రికెట్ టోర్నీలో తెయూ పరిధిలోని వివిధ కళాశాలల జట్లు పాల్గొనగా, ఫైనల్స్‌లో తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ టీమ్ ఏ జట్టు, కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల జట్టు తలపడ్డాయి. యూనివర్సిటీ జట్టు చక్కటి ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచినట్లు తెయూ స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు. అలాగే బ్యాడ్మింటన్ టోర్నీకి ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్స్‌లో తెయూ టీమ్ విజేతగా నిలువగా, కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల జట్టు రన్నర్‌గా నిలిచాయి. క్రికెట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో తెయూ జట్లను ఏర్పాటు చేసి, త్వరలో తమిళనాడు, కేరళలో జరుగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పంపనున్నట్లు బాలకిషన్ తెలిపారు. వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ బాలమణి, సందేశ్, సంపత్, ప్రభాకర్, అనిల్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్ నేత, జూనియర్ అసిస్టెంట్ జాదవ్ నరేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
వర్సిటీ బ్యాడ్మింటన్ జట్టుకు..
వర్సిటీ క్రికెట్ జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న
స్పోర్ట్స్ డైరెక్టర్ బాల కిషన్


