మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Nov 30 2026 12:52 AM | Updated on Nov 30 2026 12:52 AM

● విద్య, వైద్యంతోపాటు

అన్ని రంగాల్లో అభివృద్ధి

● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

రెంజల్‌ : మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనేక పథకాలను తీసుకు వస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సల హాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నా రు. మండలంలోని స్వయం సహాయక సంఘాల స భ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీని రెంజల్‌ మండలం సాటాపూర్‌లో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ భూములు ఉన్న మహిళలు కూరగాయల సాగుపై దృష్టి సారించాలని, అవసరమైన విత్తనాల ను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో మహిళలకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని అన్నా రు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాలను అభివృద్ధిలోకి తీసుకు వస్తున్నామన్నారు. మరో రెండు సంవత్సరాలు ఇలాగే పని చేసి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మహిళలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మండలంలోని పలువురు సీఎం సహాయనిధి చెక్కులను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మొబీన్‌ఖాన్‌, డీఆర్‌డీవో సాయన్న, సర్పంచ్‌లు లచ్చవార్‌ సుహాసిని, ధనూర్‌ నర్సవ్వ, మాధవి, ధనుంజయ్‌, భానుచందర్‌, క్యాతం యోగేశ్‌, గయాసొద్దీన్‌, జుబేర్‌, అశోక్‌నాయక్‌, విండో చైర్మన్‌లు సాయారెడ్డి, జావిదోద్దీన్‌, రాములు, మహిళా సమాఖ్యమండల అధ్యక్షురాలు లక్ష్మి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు రజితాయాదవ్‌, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement