ఇందూరు అబ్బాయి– కెనడా అమ్మాయి | - | Sakshi
Sakshi News home page

ఇందూరు అబ్బాయి– కెనడా అమ్మాయి

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

ఇందూరు అబ్బాయి– కెనడా అమ్మాయి

పెద్దల అంగీకారంతో

నగరంలో వైభవంగా వివాహ వేడుక

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ నగ రానికి చెందిన అబ్బాయి, కెనడా దేశానికి చెందిన అమ్మాయి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వివరా లు ఇలా.. నిజామాబాద్‌లోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన తాటిపాముల సంజయ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, ఉద్యోగం కోసం కెనడా దేశానికి వెళ్లాడు. అక్కడే అమెరికన్‌ ఫుడ్‌ కంపెనీలో పని చేస్తున్న సబ్రినాతో సంజయ్‌కు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువైపులా పెద్దలకు చెప్పడం, వారు అంగీకరించడంతో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. ఇండియాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏమీచర్చస్వైన్‌, శామ్యూల్‌ మార్క్‌స్వైన్‌లతోపాటు వారి కుమార్తె సబ్రినా ఇటీవల ఇండియాకు చేరుకున్నారు. పెళ్లికి ముందు తతంగాలు పూర్తి చేసుకున్నారు. ఆదివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌ శివారులో ని హోటల్‌ కృష్ణలో సంజయ్‌, సబ్రినా పెళ్లి వైభవంగా జరిగింది. నూతన వధూవరులను ఇరువైపులా కుటుంబసభ్యులు, బంధువులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement