డొంకేశ్వర్: మండల పరిధిలో నికాల్‌పూర్ గ్రామంలో బంజారాల అతిపెద్ద సాంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవాలు వైభంగా జరిగాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రకృతి మాతను పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు నికాల్‌పూర్‌లో పండుగ శోభను తీసుకొచ్చాయి. వేడుకల ముగింపు సందర్భంగా యువతీ యువకులు తమ సంప్రదాయ దుస్తులైన పేటియా, కంచాలి, చంతియా ధరించి కాళ్లకు గజ్లె లు కట్టి ఆడిన లంబాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. వేడుకల్లో సర్పంచ్ బానోత్ అనితాసుమన్, మాజీ ఎంపీటీసీ భీమ్‌నాయన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గొడిసెరం భూమేశ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


