ఇచ్చిన హామీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

ఇచ్చిన హామీలను అమలు చేయాలి

వర్ని: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్‌ అన్నారు. ఆదివారం మోస్రా మండల కేంద్రంలో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా కటాఫ్‌ డేట్‌ ను తొలగించి పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జీవనభృతిని రూ. 4016 చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. బీడీ కార్మికులను మోసం చేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డికి గత సీఎం కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు. బీడీ కార్మికులు కళ్యాణి, లక్ష్మి, జ్యోతి, గంగామణి, సునంద, వరలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement