బోధన్: ఎడపల్లి గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆరు తర్పాలకు సంబంధించిన 194 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు.సంఘ గ్రామ అధ్యక్షుడిగా బర్ధిపూ ర్ నర్సయ్య,ఉపాధ్యక్షులుగా కట్కం సుధా కర్, సంతోష్, బర్ధిపూర్ అశోక్, ప్రధాన కార్యదర్శు లుగా శిరిశెట్టి సంతోష్,కంజర అభినవ్, స హా య కార్యదర్శులుగా కంజరి ఓంప్రకాశ్, న్యావ నంది శ్రీకాంత్,ప్రచార కార్యదర్శిగా శివచైత న్య, కోశాధికారిగా ఆకుల సంతోష్,సలహాదా రులుగా నాయిడి పోతన్న,ఆకుల శ్రీనివాస్, బొబ్బిలి శ్రీనివాస్, భుజంగం లింగం,బర్ధిపూ ర్ విఠల్,కట్కం అరుణ్ ఎన్నికయ్యారు. కుల సంఘ పెద్దలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
నందిపేట్: మండల కేంద్రంలో జీపీ కార్మికులకు కాంగ్రెస్ నాయకుడు మంద మహిపాల్ సతీమణి మంద శ్రావణి జన్మదినం సందర్భంగా ఆదివారం దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సే వా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాప క అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, సభ్యులు గణేశ్, వేణు,నూకల ఆదిత్య,రమేశ్,మహేశ్ అగర్వా ల్,సాయి కిరణ్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ మండల కేంద్రంలో దివంగత నునుగొండ అంజయ్య స్మారకార్థంగా ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన అండర్ 17 బాలికల కబడ్డీ పోటీల్లో పోచంపాడ్ రెసిడెన్షియల్ స్కూలు బాలికల జట్టు విజేతగా నిలిచింది. అంజయ్య కుమారుడు రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే గంగాధర్, ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
బోధన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని ఆర్యసమాజ్ దయానంద్ గోశాలలో ఈ నెల 26న ప్రారంభమైన శ్రావణి ఉపాకర్మ, వేది ధర్మ ప్రచార యజ్ఞ మహోత్సవ వేడుకలు ఆదివారం ముగిశాయి. ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో యజ్ఞం, వేదపారాయణం, ప్రవచనాలు కొనసాగాయి. యజ్ఞ బ్రహ్మ శ్రీమాన్ మాఘం కృష్ణమూర్తి వేద ప్రవచనాలు చేశారు. ఆఖరి రోజు సామూహిక యజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్యసమాజ్ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై ఉన్న శివాలయంలో సోమ వారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసర ప్రాంతాల్లో పల్లకీసేవ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.


