వేల్పూర్: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమ వుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు అనిల్‌గౌడ్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో జే తులసి, శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లుకు ఆయన ఆదివారం గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమంలో వేల్పూర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి రాజేందర్, నాయకులు నరేందర్, హరికిషన్, మల్లేశ్, మోహన్, ఆర్మూర్ మోహన్, మాదారి రాజేందర్, రేవంత్‌రెడ్డి, ధనుష్, నవీన్, ఇంద్రాగౌడ్, మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాక్లూర్: మండలంలోని మాణిక్‌భండార్ గ్రామంలో ఆదివారం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశం మేరకు డీసీసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. పార్టీ మండల సీనియర్ నాయకులు గంగాధర్‌గౌడ్, పార్టీ అధ్యక్షుడు బీ దయాకర్‌రావు, సర్పంచుల ఫోరం మంల అధ్యక్షుడు సాయినేని వెంకటేశ్వర్‌రావు, మాక్లూర్ విండో చైర్మన్ బూరోల్ల అశోక్, మాజీ సర్పంచ్ అన్నబోయిన రాజేందర్, నాయకులు కంటాజి రాజేశ్వర్, లచ్చారెడ్డి, టీఎన్ రెడ్డి, జీ స్వామి, టీ లక్ష్మణ్, నుడా అధికారి జైవీర్, ఇందిరమ్మ కమిటీ, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.


