నేడు మండల మహిళా సమాఖ్య సభ
రుద్రూర్: కోటగిరి మండల మహిళా సమాఖ్య వార్షిక మహజన సభ సోమవారం నిర్వహించనున్నట్లు ఐకేపీ ఏపీఎం భాస్కర్ ఆదివారం తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 11:30 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
సభను విజయవంతం చేయాలి
రెంజల్: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్‌లో సోమవారం మధ్యాహ్నం నిర్వహించే పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు కోరారు. ఆదివారం స్థానిక విలేకరులతో తాడ్‌బిలోలి సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్, జాదవ్ రాజు, రాఘవేందర్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లా పర్యటనకు వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొదటి పర్యాయం హాజరవుతున్నట్లు వివరించారు. మండలం నుంచి భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లచ్చవార్ కృష్ణ, అశోక్ పాల్గొన్నారు.
నేడు గ్రామ సభ
రుద్రూర్: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సోమవారం గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నట్లు జీపీ కార్యదర్శి ప్రేమ్‌దాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించే సభలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
సన్మానం
బోధన్‌టౌన్: బోధన్ బల్దియా బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికై న 11 వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుకా బాలరాజు, డిప్యుటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికై న రాజుల దేవి లక్ష్మి పూజిత, ఫ్లోర్ సెక్రటరీగా ఎన్నికై న గుంత అబ్బవ్వను పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్, మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్, ప్రధాన కార్యదర్శి మిర్జాపూర్ బాలరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


