● 27న ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో
శంకుస్థాపన
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్
ముప్ప గంగారెడ్డి
సుభాష్‌నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్, గాంధీగంజ్‌లో రూ.6.56 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డులో గంగారెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజ్‌లలో
అభివృద్ధి పనులకు ఈనెల 27న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క శంకుస్థాపన చేస్తారన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, ఇన్‌చార్జి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విజయ్ కిషోర్, డైరెక్టర్లు రాజలింగం, మారుతీ మల్లేష్, గంగారెడ్డి, బాగారెడ్డి, నరేందర్, మహ్మద్ ఈసా, రామకృష్ణ, కౌడపు రఘువీర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి
ఇంటింటి సర్వే
● 1560 మంది బీఎల్‌వోల నియామకం
నిజామాబాద్ అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. బూత్‌స్థాయి అధికారులు ప్రస్తుతం ఉన్న ఓటర్లకు రెండు ఎ న్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఓట రు సంబంధిత ఫారాలను నింపాలి. బూత్ స్థాయి అధికారులు వచ్చి ఒక ఫామ్‌ను తీసుకుంటారు. ఫామ్‌లను ఆన్‌లైన్‌లోనూ అప్‌లోడ్ చేయవచ్చు. కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిక్లరేషన్ ఫారాంతో పాటు ఫామ్–6ను కూడా అందిస్తారు. జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 28 వరకు నోటీసులు, ఎన్యూమరేషన్ ఫారాలపై అభ్యంతరాల పరిష్కారం చేపడుతారు. అక్టోబర్ ఒకటిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అలాగే 2002 ఓటర్ జాబితాలో పేర్లు లేనివా రు తమ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడీ వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపాలి. ఇప్పటికే నియోజక వర్గాల వారిగా ఓటర్ మ్యాపింగ్‌ను పూర్తి చేశారు. బీఎల్‌వోలకు శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరు ఫారాలను అందించి వివరాలను సేకరిస్తారు.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
ఖలీల్‌వాడి: జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని డీఈవో పార్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి తుది జాబితాను ప్రకటిస్తారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈనెల 15 నుంచి జూలై10 వరకు https://nationalawardsto teachers.education.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మద్నూర్: అవాల్‌గావ్ సర్పంచ్ కీసర్వార్ మాన్యబాయి ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలు గు అసోసియేషన్ (వెటా) ఇండియా కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆమెను అభినందించారు. మహిళ సాధికారత కోసం చేసిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ గౌర వం దక్కిందని మాన్యబాయి పేర్కొన్నారు.


