28న పోలియో చుక్కలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

28న పోలియో చుక్కలు పంపిణీ

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీ

సుభాష్‌నగర్‌: ఐదేళ్లలోపు పిల్లలకు జూన్‌ 28న పోలియో చుక్కల మందు పంపిణీ చేయనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ బి రాజశ్రీ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్‌లోగల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ ఆరో గ్య కార్యక్రమాలపై ఆమె సమీక్షించారు. రాజశ్రీ మాట్లాడుతూ మొదటిరోజు 28న 90 శాతానికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. 29న, 30న వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కలు పంపిణీ చేయాలన్నారు. ఇటుక బట్టీలు, కన్‌స్ట్రక్షన్‌ భవన నిర్మాణాలు జరిగే ప్రదేశాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఐదేళ్లలోపు అర్హులైన పిల్లలందరికీ మందులు వేసి వందశాతం పూర్తి చేయాలని సూచించారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లోభాగంగా క్షయ రహిత గ్రామాల మా దిరి పట్టణాల్లో కూడా క్షయ రహిత వార్డుల కోసం లక్షణాలు ఉన్న వారందరినీ పరీక్షించాలన్నా రు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, న్యూట్రిషన్‌ కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. జీవనశై లి వ్యాధుల నియంత్రణలో భాగంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 932 క్యాన్సర్‌ కేసులు ఉన్నట్లు తేలిందని, ప్రతి కేసును స్థానిక వైద్యాధికారి సమీక్షించి నిర్ధారించుకోవాలన్నారు. మొత్తం జనాభాలో 30 ఏళ్లు పైబడిన వారు 52 శాతం ఉంటారని, వారికి హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, క్యాన్స ర్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. కాగా పోలి యో చుక్కల మందు వేసిన తర్వాత మార్కింగ్‌ చేసేందుకు 1100 మార్కర్‌ పెన్నులను రెడ్‌క్రాస్‌ ప్ర తినిధులు డీఎంఅండ్‌హెచ్‌వో అందించారు. సమావేశంలో డీటీసీవో డాక్టర్‌ బేబీ నాగేశ్వరి, ఏవో సు మంత్‌ కుమార్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సికందర్‌ నాయక్‌ ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ వెంక న్న, డాక్టర్‌ శిఖర, డాక్టర్‌ వెంకటేష్‌, డాక్టర్‌ శ్రావ్య, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ ఆంజనేయులు, రాష్ట్ర ఎంసీ కమిటీ మెంబర్‌ తోట రాజశేఖర్‌పాల్గొన్నారు.

24ఎన్‌జెడ్‌టి241 : రోడ్డు ప్రమాదంలో కిందపడిపోయిన భర్తకు సపర్యాలు చేస్తున్న నూతన వధువు

24ఎన్‌జెడ్‌టి 242 : ప్రమాదంలో దెబ్బతిన్న నూతన దంపతుల కారు

24ఎన్‌జెడ్‌టి 243 : జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement