కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై గతంలో నమోదైన మూడు క్రిమినల్ కేసులను హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. వెంకటరమణారెడ్డి న్యాయవాదులు ఎల్.ప్రభాకర్‌రెడ్డి, వై.రాము లు, టి.ఉదయ్ రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ పట్టణ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా 2023లో స్థానిక రైతు లు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, హక్కుల పరిరక్షణ కోసం చేపట్టి న ఆందోళనల్లో కేవీఆర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మూడు కేసు లు నమోదయ్యాయి. వాటిని సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవంటూ వాటిని కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు.


