ఖలీల్‌వాడి: ఇంటర్మీడియెట్ విద్యనందిచడంతోపా టు విద్యార్థులను జాతీయస్థాయి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధం చేసేందుకు ఉద్దేశించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ని శిథిల భవనంలో ఏర్పా టు చేయడం ఏమిటని విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో విద్యనభ్యసించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి జేఈఈ, నీట్, ఎప్‌సెట్, క్లాట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో పోటీ పడే విధంగా వారికోసం కంజర (మోపాల్), నిజామాబాద్ అర్బన్ మహాత్మ జ్యోతిబా పూలే (ఎంజేపీ) గురుకులాలను సీవోఈలుగా ఎంపిక చేశారు. అయితే డిజిటల్ తరగతులు, అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేసి విద్యనందించాల్సిన సీవోఈల ను శిథిలభవనంలో ఏర్పాటు చేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
నాలుగు బీసీ గురుకుల కళాశాలలు..
జిల్లాలోని మోర్తాడ్, రాంపూర్, కంజర(మోపాల్), నిజామాబాద్ అర్బన్ బీసీ గురుకుల కళాశాలలకు భవనాలు లేకపోవడంతో డిచ్‌పల్లి మండలం ధర్మారంలోని కాకతీయ బిల్డింగ్‌లో ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. కంజర, నిజామాబాద్ అర్బన్ గురుకులాలు సీవోఈలుగా ఎంపికయ్యాయి. స్థానికంగానే ఉన్న మరో విద్యా సంస్థకు చెందిన భవనంలో ‘ఇందూర్ స్కూల్’ను ఎంజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వారు. సుమారు 460 మంది విద్యార్థులు వసతులు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే కాలేజీకి అప్‌గ్రేడ్ కావడంతో కంజరకు తరలిపోయింది.
కలెక్టర్ చొరవ చూపిస్తే మేలు..
పాత భవనంలో బీసీ గురుకులాలు (సీవోఈ) ఏర్పాటు చేయకుండా కలెక్టర్ చొరవ చూపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అరకొర వసతుల మధ్య నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్ ్డ్స, ఎప్‌సెట్, క్లాట్, లాసెట్ వంటి అత్యుత్త మ శిక్షణ ఎలా పొందవచ్చని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్పందించి భవనాన్ని పరిశీలించాలని, సీవోఈలను అన్ని సౌకర్యాలు ఉన్న భవనంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భవనం పరిస్థితి పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్‌సీవో సత్య నాథ్‌రెడ్డికి ఫోన్‌లో వివరించినట్లు సమాచారం.
రేకుల షెడ్డులో తరగతి గది
సిమెంట్ వాటర్ ట్యాంక్ పరిస్థితి..
డోర్‌లు లేని మరుగుదొడ్లు
కథ మొదలైంది ఇక్కడే..
అప్‌గ్రేడ్ కావడంతో ఇందూర్ స్కూల్ తరలిపోవడంతో ఖాళీగా ఉన్న భవనంలోకి సీవోఈలను ఏర్పాటు చేయించుకునేందుకు ఆ భవన యజమాని తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు తెలిసింది. సరిపడా తరగతి గదు లు, ల్యాబ్‌లకు గదులు లేకపోగా, వాష్ రూమ్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రేకుల షెడ్డుల్లో తరగతి గదులను కొనసాగించాల్సిన పరిస్థితి. ఇటువంటి భవనంలో ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. రాష్ట్ర బీసీ గురుకుల కమిషనర్ సీఈవో విద్యార్ధులకు అవసరమైన మెటీరియల్ పంపించారు. అయితే ఈ శిథిల బిల్డింగ్‌లో మెటీరియల్‌ను నిల్వ చేసే పరిస్థితి లేదని తెలిసింది.
ఎంజేపీ సీవోఈపై రాజకీయ ఒత్తిళ్లు!
230 మంది విద్యార్థుల
భవిష్యత్‌తో చలగాటం
నీట్, జేఈఈ, ఎప్‌సెట్ కోచింగ్‌కు
అనుకూలంగా లేని భవనం
రేకుల గదులు, డోర్లు లేని టాయిలెట్లు
ఆ బిల్డింగ్‌లో వద్దంటూ ఆర్‌సీవోకు విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం
రాజకీయ ఒత్తిడి లేదు
పాత జీనియస్ స్కూల్ భవనంలో సీవోఈల ఏర్పాటుకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు. ఈ భనవంలో దసరా వరకు నాలుగు గదులు నిర్మించడంతోపాటు వచ్చే ఏడాది వరకు భవనాన్ని పూర్తిస్థాయిలో అందిస్తానని యజమాని అగ్రిమెంట్ ఇచ్చారు. అవసరమైన మరమ్మతులు చేస్తారు. గతేడాది ఏంజేపీకి సంబంఽధించిన ఇందూర్ స్కూల్ ఈ భవనంలోనే కొనసాగింది.
– సత్యనాథ్‌రెడ్డి, ఆర్‌సీవో, నిజామాబాద్ జిల్లా


