బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ పూర్తిచేయాలి

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

సుభాష్‌నగర్‌: జిల్లాలో ఎల్పీజీ వినియోగదారుల బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ ప్రక్రియను ఈనెల 30వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పౌరసరఫరాలశాఖ అధికారులు, ఎల్‌పీజీ డీలర్స్‌ అసోసియేషన్‌తో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. బయోమెట్రిక్‌ ఆధార్‌ ప్రక్రియ పూర్తి కాలేదనే కారణంతో ఏ ఒక్క వినియోగదారుడికీ డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను నిలిపేయొద్దని ఆదేశించారు. ఇన్వాయిస్‌ బిల్లు కన్నా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినట్లు ఫి ర్యాదులు వస్తే డీలర్లను బాధ్యులను చేస్తూ కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టొద్దని, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ఆధారిత డెలివరీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డీలర్లను ఆదేశించారు.

బీఎల్‌వోలకు కిట్లు

అందజేత

నిజామాబాద్‌ అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపట్టేందుకు ఇంటింటికి వెళ్లనున్న బూత్‌ లెవెల్‌ అధికారులకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి బీఎల్‌వో కిట్లను మంగళవారం కలెక్టరేట్‌లో అందజేశారు. పారదర్శక ఓటరు జా బితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్‌వోలకు కలెక్టర్‌ సూచించారు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, డీఆర్‌వో గీత, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఐక్యరాజ్య సమితి

సదస్సుకు జునైద్‌ అలీ

నిజామాబాద్‌ లీగల్‌ : జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది, సామాజికవేత్త మహ్మద్‌ జునైద్‌ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వ హించనున్న అంతర్జాతీయ సదస్సుకు దేశం తరఫున ప్రాతినిథ్యం వ హించనున్నారు. ‘వాతావరణ మార్పులు, సమగ్ర అభివృద్ధి’పై థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఈనెల 29, 30 తేదీల్లో సదస్సు జరగనుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ (యూఎన్‌డీఈఅండ్‌ ఎస్‌ఏ), ఎకనామిక్స్‌ అండ్‌ సోసియల్‌ కమీషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌ (యూఎన్‌ఈఎస్‌సీఏపీ) సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. ‘వా తావరణ మార్పులు, సుస్థిర అభివద్ధి లక్ష్యా ల మధ్య సమన్వయం’పై జునైద్‌ అలీ చర్చించనున్నారు. ఆయనకు సామాజిక కార్యకర్తలు, న్యాయవాద సంఘాల సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

కిసాన్‌ మోర్చా జిల్లా

అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి

సుభాష్‌ నగర్‌: బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జక్రాన్‌పల్లి మండలం మనోహ రాబాద్‌ గ్రామానికి చెందిన పాట్కూరి తి రుపతిరెడ్డి రెండోసారి నియమితులయ్యా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రా వు ఆదేశాల మేరకు కిసాన్‌ మోర్చా రాష్ట్ర అ ధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిరెడ్డి గతంలో మనోహరాబాద్‌ సర్పంచ్‌గా పనిచేశారు. జిల్లాలో రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల సమస్యలపై భవిష్యత్‌లో మరింత ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేష్‌ రెడ్డి, పసుపు బోర్డు చైర్మ న్‌ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement