అధికారులు తీరు మార్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు తీరు మార్చుకోవాలి

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

విధుల్లో అలసత్వం వహిస్తే

ఊరుకునేది లేదు

అర్బన్‌ ఎమ్మెల్యే

ధన్‌పాల్‌ సూర్యనారాయణ

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, అలసత్వం వహిస్తే ఊరు కునేది లేదని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. నగర కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం ఇంజినీరింగ్‌, శానిటేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందితో స మావేశం నిర్వహించారు. ఒక్కో విభాగం వారీగా ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. టౌన్‌ ప్లానింగ్‌లో అనేక ఫిర్యాదులు తన దష్టికి వచ్చాయని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకోవా లని ఆదేశించారు.

అలాగే ఇంజినీరింగ్‌ అధికారులు నగరంలో కొనసాగుతున్న పనులతోపాటు స్ట్రీట్‌ లైట్‌, పచ్చదనంపై దృష్టిసారించాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శానిటేషన్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో నెలరోజుల్లో మళ్లీ అన్ని విభాగాలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. కమి షనర్‌ దిలీప్‌ కుమార్‌, అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఆయా విభాగాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement