నవీపేట: మండల కేంద్రంలో నూతనంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనుండగా, అనువైన స్థలం కోసం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. నవీపేటలోని ప్రభుత్వ బాలికల, బాలు ర ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. అలాగే మేకలు, కూరగాయల సంత ప్రాంగణాన్ని నిర్మాణానికి అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచనను పరిగణనలోకి తీసుకున్నారు. అనువైన స్థలం ఎంపిక జరిగాక స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వేర్వేరుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రముఖుల పేర్లను అడిగి తెలుసుకున్నారు.


