వానలు కురవాలి..రైతులు మురవాలి | - | Sakshi
Sakshi News home page

వానలు కురవాలి..రైతులు మురవాలి

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

నానో యూరియాతో

అధిక ప్రయోజనాలు

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

రెంజల్‌(బోధన్‌): వానాకాలం సీజన్‌లో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు మురవాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అకాంక్షించారు. రెంజల్‌ మండలం దండిగుట్టలో మంగళవారం రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన పాల్గొని, ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. జీపీ భవనం మీడియా సమావేశంలో మాట్లాడారు. చెరువులు, కుంటల్లో మట్టి, మొరం తవ్వకాలను అధికారులు అడ్డుకోవద్దని సూచించారు. సమాంతరంగా తవ్వడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ప్రమాదకరంగా గుంతలు తవ్వకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. యూరియా కష్టాలను అధిగమించేందుకు ప్రభు త్వం మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. నానో యూరియాతో అధిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అనంతరం స్థానిక అధికారులతో సమావేశ మై పలు సూచనలు అందించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్‌, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, సర్పంచ్‌లు ధనుంజయ్‌, గయాసోద్దిన్‌, తెలంగాణ శంకర్‌, మల్లేశ్‌, నాయకులు సాయరెడ్డి, రాములు, జావీద్‌, ఒడ్డెక్క మోహన్‌, సాయిబాబగౌడ్‌, అసానీ అనీల్‌, నితిన్‌, సురేందర్‌గౌడ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలందించాలి..

బోధన్‌: ప్రభుత్వాస్పత్రులకు వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి వైద్యులు,సిబ్బందికి సూచించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూ తన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్ని పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి మండల టాపర్స్‌గా నిలిచిన విద్యార్థినులు రూమేస్సా, అల్ఫీనాలను శాలువాతో సన్మానించి అభినందించారు. సర్పంచ్‌ సుంచన కోట అనురాధ రాధ కిషన్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ నీలం కృష్ణ, పాఠశాల హెచ్‌ఎం జోన్స్‌, ఎడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి వినీత్‌కుమార్‌ రెడ్డి, తహసీల్దార్‌ దత్తాద్రి,కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు పులి శ్రీనివాస్‌, లక్ష్మి నర్సింహాస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ గౌడ్‌, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కమలాపూర్‌లో పల్లె దవాఖానా ప్రారంభం

నవీపేట: మండలంలోని కమలాపూర్‌ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుమూల గ్రామాలలోని కొందరు ఆర్‌ఎంపీలు కాసుల కక్కుర్తికి అలవాటు పడి కార్పొరేట్‌ ఆస్పత్రులకు పంపిస్తున్నారని, వారి మాయమాటలు నమ్మవద్దని సూచించారు. లేనిపోనా భయాన్ని సృష్టించే నకిలీ ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేయాలని స్థానిక సీఐ, ఎస్సైలను ఆదేశించారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు నగేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్లకు ఇళ్ల పట్టాల పంపిణీ

బోధన్‌టౌన్‌: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం 59 మంది ఆటోడ్రైవర్లకు సుదర్శన్‌రెడ్డి పట్టాలు అందజేశారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 8 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్లకు స్థలాలు కేటాయించారు. ఆటో యూనియన్‌ ప్రతినిధులు, ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement