బోధన్‌లో సర్‌ హెల్ప్‌డెస్క్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బోధన్‌లో సర్‌ హెల్ప్‌డెస్క్‌ ప్రారంభం

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

బోధన్‌: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌– స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)సర్వే ప్రక్రియలో తలెత్తే సమస్యలు, సందేహాలు నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశామని బోధన్‌ ఆర్డీవో విజయకుమారి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్‌ ఆవరణలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్షన్‌ సెల్‌ వద్ద సర్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఆర్డీవో ప్రారంభించారు. హెల్ప్‌డెస్క్‌ను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ విఠల్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుశీల,ఆపరేటర్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఓటరు సవరణను

సక్రమంగా చేపట్టాలి

వేల్పూర్‌: త్వరలో నిర్వహించే ప్రత్యేక ఓటరు సవరణ(సర్‌) కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని వేల్పూర్‌ మండల తహసీల్దార్‌ అనిరుధ్‌ పేర్కొన్నారు. మంగళవారం వేల్పూర్‌ రైతు వేదికలో మండల, గ్రామాల బూత్‌స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్‌లో పొందుపరచిన నియమ నిబంధనలు అనుసరించి గ్రామాలో ఓటరు జాబితా రూపొందించాలని చెప్పారు. ఎటువంటి పొరపాట్లు జరిగినా బూత్‌స్థాయి అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement