రైతు వేదికల్లో విత్తన మేళా | - | Sakshi
Sakshi News home page

రైతు వేదికల్లో విత్తన మేళా

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

పెర్కిట్‌/వర్ని/వేల్పూర్‌/మాక్లూర్‌ : ప్రభుత్వ ఆదేశాల మేరకు పలుచోట్ల రైతువేదికల్లో విత్తన మేళా లు నిర్వహించారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని పిప్రి, ఫత్తేపూర్‌, గోవింద్‌పేట్‌, వర్ని, వేల్పూర్‌, పడగల్‌, అంక్సాపూర్‌, పచలనుడ్కుడ, మోతె, మాక్లూర్‌, గొట్టిముక్కుల, చిన్నాపూర్‌, అ మ్రాద్‌ రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీఏ విజయలక్ష్మీ మాట్లాడుతూ విత్తన డీలర్లు ప్రభుత్వం గుర్తించిన విత్తన రకాలను రైతులకు ప్రదర్శించడానికి విత్తన మేళా నిర్వహించినట్లు తెలిపారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఏఈవోలు, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement