సాలూర మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

సాలూర మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఎన్నిక

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

బోధన్‌: సాలూర మండల ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం ఆవరణలో మండలంలోని గ్రామ ఉపసర్పంచ్‌లు సమావేశం అయ్యారు. అధ్యక్షుడిగా భుయ్యన్‌ సురే శ్‌ పటేల్‌( సాలూర) ఉపాధ్యక్షుడు మహేశ్‌ రెడ్డి( సాలూర క్యాంప్‌),ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్‌( మందర్నా), కార్యదర్శిగా ఎం.డి.సత్తార్‌ (సాలంపాడ్‌) కోశాధికారిగా శ్రావణ్‌ మిగిలిన ఉపసర్పంచ్‌లు సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపసర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ తొలగించినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement