పేకాడుతున్న ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పేకాడుతున్న ముగ్గురి అరెస్టు

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

పేకాడుతున్న ముగ్గురి అరెస్టు శతాధిక వృద్ధురాలు మృతి పీఆర్టీయూలో పలువురి చేరిక ఇద్దరు కానిస్టేబుళ్లకు పదోన్నతి

బోధన్‌ రూరల్‌: సాలురా మండలంలోని మందర్న గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను బోధన్‌ రూరల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బోధన్‌: సాలూర మండల కేంద్రానికి చెందిన శతాధి క వయస్సు ఉన్న వృద్ధురా లు కందిమల్‌ రామ వ్వ(103) మంగళవారం సాయంత్రం కన్నుమూ శా రు. ఆరు నెలల నుంచి ఆ నారోగ్య సమస్యలతో ఆ మె బాధపడుతుంది. వందేళ్లకు పైగా రామవ్వ ఆరోగ్యంగానే తమ మధ్య జీవనం గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం మ ధ్యాహ్నం స్వగ్రా మంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు.

ఖలీల్‌వాడి: డొంకేశ్వర్‌ మండల తపాస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, జక్రాన్‌పల్లి అధ్యక్షుడు శ్రీనివాస్‌ పీఆర్టీయూ చేరారు. జిల్లాకేంద్రంలో మంగళవారం వారికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొద్దుటూరి మోహన్‌రెడ్డి, గంగోని కిషన్‌ సంఘ కండువాలు వేసి, ఆహ్వానించారు. సుదర్శన్‌, శ్రీనివాస్‌లను పీఆర్టీయూ రాష్ట్ర అసోషియేట్‌ అధ్యక్షులుగా నియమించినట్లు జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు మోహ న్‌ రెడ్డి తెలిపారు. జక్రాన్‌పల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపి, రవీన్‌, డొంకేశ్వర్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్‌, మోహన్‌, ఎడపల్లి అధ్యక్షుడు సాయిరెడ్డి, రేంజల్‌ అధ్యక్షుడు సోమలింగం గౌడ్‌, నాయకులు ప్రవీణ్‌ రెడ్డి, గట్ల కిషన్‌, సంతోష్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ శాఖలోని ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం సీపీ సాయిచైతన్య పదోన్నతి పొందిన బి.సుదర్శన్‌, ఎన్‌.ప్రసాద్‌ను అభినందించారు.

జిల్లాకేంద్రంలో కారు చోరీ

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని ఒకటవ టౌన్‌పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు చోరీ జరిగింది. వివరాలు ఇలా.. నగరంలోని చైన్నె షాపింగ్‌మాల్‌ సమీపంలో కొన్ని కార్లు అద్దె కోసం నిలిపి ఉన్నాయి. హైమద్‌ అనే వ్యక్తి మంగళవారం కారు రెంట్‌కు కావాలని, నాందేడ్‌కు వెళ్లాలని కారు ఓనర్‌తో మాట్లాడుకున్నాడు. అనంతరం వారు నాందేడ్‌కు బయలుదేరారు. గాంధీచౌక్‌లో అరటిపండ్లు కొనుగోలు చేసి, తీసుకురావాలంటూ డ్రైవర్‌కు హైమద్‌ తెలిపాడు. దీంతో డ్రైవర్‌ అరటిపండ్లు కొనుగోలు చేసేందుకు కారు దిగి వెళ్లగా, హైమద్‌ కారుతో పరారయ్యాడు. దీంతో బాధితుడు ఒకటవ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని పాన్‌గల్లీ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా మహాలక్ష్మి మందిరానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఇందులో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం లేకుండా ఏర్పాట్లు

ఆర్మూర్‌: ఆర్మూర్‌ విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కొత్తగా విద్యుత్‌ లైన్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి మౌళిక వసతులను బలోపేతం చేసినట్లు ఆర్మూర్‌ పట్ట ణ–1,2 ఏఈలు నజ్మా, సాయి వినాయ్‌ పేర్కొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గృహజ్యోతి పథకంలో భాగంగా ఉచిత విద్యుత్‌ ప్ర యోజనం పొందాలంటే కేవలం 200 యూనిట్ల లోపు వినియోగం ఉండాలన్నారు. 200ల యూని ట్లు దాటితే ఈ పథకం వర్తించదని వివరించారు. నెల వారీ బిల్లులను సైతం సకాలంలో చెల్లించని పక్షంలో రూ.25, రూ.75, రూ.250 జరిమానా విధిస్తామన్నారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేసే అవకాశం సైతం ఉందని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement