ఆర్మూర్‌టౌన్/మాక్లూర్/బోధన్‌రూరల్/నందిపేట్ : యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సైలు అనిల్‌రెడ్డి, రజనీకాంత్, రా జశేఖర్ అన్నారు. ఆర్మూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో, మాణిక్‌భండార్, పెగడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
నందిపేట్ (ఆర్మూర్): గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అరికట్టే అవకాశం ఉందని ఆ ర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో మంగళవారం ఎస్ ఐ వినయ్ ఆధ్వ ర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎర్రం లింగం, ఉప సర్పంచ్ రామచందర్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, తదితరులున్నారు.
నందిపేటలో మాట్లాడుతున్న సీఐ జాన్‌రెడ్డి
అవగాహన కల్పిస్తున్న ఎస్సై రజినీకాంత్


