వేల్పూర్: మండలం అంక్సాపూర్ హైస్కూల్‌లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు రూ. 24 వేల విలులైన స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిళ్లను మంగళవారం విద్యార్థులకు అందజేశారు. ఎన్.ఆర్.ఐ లు, గ్రామ పూర్వ విద్యార్థులు సుంకరి నరేశ్, బాల రాజేశ్వర్, బి.నవీన్, సుంకరి రాజేశ్, రిక్క వంశీలు విద్యార్థులకు అవసరమైన వస్తువులను వితరణ చేశారు. ప్రాథమిక పాఠశాలకు మూడు అదనపు గదులు, ప్రహరీ నిర్మాణానికి రూ. 63 లక్షల నిధు లు మంజూరు చేయించిన సొసైటీ మాజీ చైర్మన్ దేగాం రాములును సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ నేరెళ్ల రాజేశ్వర్‌రెడ్డి, హైస్కూలు, ప్రైమరీస్కూలు హెచ్‌ఎంలు మల్లీశ్వరి, రాజేందర్‌గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నోట్‌బుక్స్ పంపిణీ
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీలోని శ్రీ సరస్వతి శిశుమందిరం పాఠశాలలో మంగళవారం చిట్ చాట్ సర్వీస్ భాగంగా నోట్ బుక్కుల, బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి శిశుమందిరం పాఠశాల కమిటీ అధ్యక్షులు గణేశ్, ప్రతినిధులు మహేశ్, నరేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


