న్యూస్‌రీల్
నిజామాబాద్
● నిత్యం వేలాది మందితో సిట్టింగ్‌లు
● ప్రధాన రోడ్లపై మందుబాబుల
హంగామా
● తనిఖీలు మరచిన అధికారులు
సెమిస్టర్ పరీక్ష ఫలితాలు..
తెయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్స్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వీసీ యాదగిరిరావు,
రిజిస్ట్రార్ యాదగిరి విడుదల చేశారు.
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2026
– 8లో u
జిల్లా కేంద్రంలో పర్మిట్ రూమ్‌ల పేరిట వైన్స్‌ల పక్కన అక్రమ సిట్టింగ్‌లు నడుస్తున్నాయి. బార్‌లను తలదన్నేలా సిట్టింగ్ రూమ్‌లను నడుపుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు, మద్యం వ్యాపారులు కుమ్మకై ్క నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి అయితే చాలు వందలాది మంది మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. గూపన్‌పల్లి చౌరస్తా వద్ద నిబంధనలకు విరుద్ధంగా వేసిన రేకుల షెడ్డులో నిత్యం వందలాది మంది మద్యం సేవిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు తలుపులు మూసి కేంద్రాలు కొనసాగుతున్నాయి. వైన్స్‌ల సమయం ముగియగానే అందులోని మందు బాటిళ్లను తీసుకువచ్చి సిట్టింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నారు. కంఠేశ్వర్, గూపన్‌పల్లి, గంగస్థాన్, వినాయక్‌నగర్ ప్రధాన రోడ్డు, దుబ్బా రోడ్ వద్ద ఉన్న మద్యం షాపుల నిర్వాహకులతో కొందరు ప్రయివేటు వ్యక్తులు ఒప్పందం చేసుకొని పర్మిట్ రూమ్‌లను బార్‌ల మాదిరిగా నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 100 మంది వరకు సిట్టింగ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ అక్రమ సిట్టింగ్‌ల నిర్వహణతో మద్యం ప్రియులు చిత్తుగా తాగి రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చేవారు మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నారు.
ఎకో టూరిజం మరో ముందడుగు
జిల్లాలో ఎకై ్సజ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వైన్స్ నిర్వాహకులు కొందరు అక్రమ దందాలు నిర్వహిస్తున్నారు. బార్‌లను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నిత్యం వేలాది మంది సిట్టింగ్‌లో మద్యం సేవిస్తున్నారు. వైన్స్ నిర్వాహకులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నా సంబంధిత ఎకై ్సజ్ శాఖ చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – నిజామాబాద్‌అర్బన్
తనిఖీలు చేస్తాం
వైన్స్‌ల వద్ద పరిమితికి మించి సిట్టింగ్ కేంద్రాలు కొ నసాగితే చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేస్తాం. అనుమతి మేరకే పర్మిట్ రూమ్‌లు ఉండాలి.
– స్వప్న, ఎకై ్సజ్ శాఖ ఎస్‌హెచ్‌వో, నిజామాబాద్


