వైన్స్‌ల వద్ద అక్రమ సిట్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎకై ్సజ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా పలు వైన్స్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ఎకై ్‌స్జ్ శాఖ ఎందుకు దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందోనని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. వైన్స్ యజమానుల ద్వారా సిట్టింగ్ కేంద్రాల నిర్వాహకులు నెలవారీ మామూళ్లు అందిస్తుండటంతోనే పట్టింపు కరువైందనే ఆరోపణలున్నాయి.


