సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూ డా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందస్తు చ ర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకు ని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారు ల్లో మురుగు జలాలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సోమవారం ఉదయం నగరంలోని ఆయా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. బోధన్ రోడ్, ఖిల్లా రోడ్డు, ఫ్రూట్ మార్కెట్, దేవీ థి యేటర్ చౌరస్తా, ఖలీల్‌వాడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవన సముదాయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన మార్గాల్లోని డ్రెయినేజీలను పరిశీలించి, చెత్తాచెదారం పేరుకుపోకుండా వెంటనే శుభ్రం చేయించాలని, వర్షపు జలాలు నిల్వ ఉండకుండా సాఫీగా ముందుకు ప్రవహించేలా డ్రెయినేజీలపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సుదర్శన్‌రెడ్డి సూచించా రు. వానల వల్ల రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చేయించాలని, అవసరమైన చోట డ్రెయినేజీల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు కలు షితం కాకుండా సరఫరా తీరును నిశితంగా పర్యవేక్షించాలన్నారు. మూడు నెలల అవసరాలకు సరిప డా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, తా గు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా కల్పించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్య బోధించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఈసారి నగరంలోని అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఒక్కో సర్కిల్ వారీగా 60 డివిజన్లలో డ్రెయినేజీలు, రోడ్లు శుభ్రం చేయడం, చెత్త తరలించడం, పిచ్చిమొ క్కలు, ముళ్ల పొదలు శుభ్రం చేయడం వంటి పను లు పూర్తయ్యాయన్నారు. సుమారు రూ.70 లక్షల వ్యయంతో మురుగుకాల్వల్లో పూడికతీత పనులు కూడా వేగవంతంగా చేయిస్తున్నామని పేర్కొన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నగేష్‌రెడ్డి అధికారులు ఉన్నారు.
తాగునీరు కలుషితం కాకుండా
పర్యవేక్షించాలి
ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి
కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి నగరంలో విస్తృత పర్యటన


