నిజామాబాద్ అర్బన్: విదేశీ ఉద్యోగ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జి ల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను ఆమె సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, ఒమన్ తదితర దేశాలలో ఉన్న ఇంజినీర్స్, టెక్నీషియన్స్, సూపర్‌వైజర్, నర్సులు, డ్రైవ ర్లు బైక్ రైడర్స్, కార్పెంటర్, మిషన్ వర్కర్స్, హెల్పర్స్, ప్లంబర్ తదితర ఉద్యో గాల కోసం మేళాలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి కల్పన శాఖ అధికారి విజేత, అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, భుజంగరావు, డీఆర్వో లత పాల్గొన్నారు.
ప్రజావాణికి 160 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరే ట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 160 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్న, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు వివరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
పోలీస్ ప్రజావాణికి 17..
నిజామాబాద్‌అర్బన్: పోలీస్ ప్రజావాణి కా ర్యక్రమంలో 17 ఫిర్యాదులు వచ్చాయి. క మిషనర్ సాయిచైతన్య సోమవారం తన కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించా రు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, చట్టపరంగా న్యాయం చేయాల ని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీసు అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.
అటవీ అధికారిపై
ఇంటెలిజెన్స్ ఆరా!
డొంకేశ్వర్(ఆర్మూర్): అవినీతి ఆరోపణల తో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న ఓ డిప్యూటీ రేంజ్ (డీఆ ర్వో) ఆఫీసర్ ఎవరనే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ నెల 22న సాక్షిలో వచ్చిన ‘అవినీతి ఉచ్చులో అటవీ అధికారి’ అనే కథనం అటవీ శాఖను కుదిపేసింది. ఇప్పటికే సదరు అధికారి ఎవరనేది చాలా మంది ఉద్యోగులకు తెలిసిపోయిన ప్పటికీ బటయకు తెలియనట్లుగా ఉంటున్నారు. అయితే, సాక్షి కథనంతో ఇంటలిజెన్స్ వర్గాలు సోమవారం విస్తృతంగా ఆరా తీశారు. సదరు డిప్యూటీ రేంజ్ అధికారితో పాటు విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లిన ఎఫ్‌ఆర్వో మీద కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.


